బీహార్‌లో ఎన్నికలు ఉన్నాయనే జీఎస్‌టీ తగ్గించారు: సీపీఐ నారాయణ
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని కవిత మాటలతో తేలిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ఆదివారం ఆయన ముగ్దుంభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కవిత మాటలతో తనకు సంబంధం లేదని హరీశ్‌రావు అంటున్నారని, ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరంపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు.

- కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత మాటల్లో తేలింది
- సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ
హైదాబాద్, సెప్టెంబర్7(విధాత): బీహార్‌లో ఎన్నికలున్నాయనే కేంద్రం జీఎస్‌టీ స్లాబ్‌లను తగ్గించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. మొదటి నంచి జీఎస్‌టీ వల్ల సామాన్యులకు ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్తూ వచ్చామన్నారు. అయితే జీఎస్‌టీ తీసుకు వచ్చిన 9 ఏళ్ల తరువాత కేంద్రం స్లాబ్‌లు తగ్గించిందన్నారు. జీఎస్‌టీ కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయాలను ప్రధాని తప్ప ఎవరూ మార్చడానికి వీలు లేదని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని కవిత మాటలతో తేలిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ఆదివారం ఆయన ముగ్దుంభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కవిత మాటలతో తనకు సంబంధం లేదని హరీశ్‌రావు అంటున్నారని, ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరంపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు. బీజేపీతో పొత్తు ఉండడం వల్లనే కేంద్రం తీసుకున్న నిర్ణయాలను బీఆరెస్ వ్యతిరేకించడం లేదన్నారు. ఉపరాష్ట్ర పతి ఎన్నికలో సుదర్శన్ రెడ్డి కి ఓటు వేయకపోతే బీజేపీ బీ ఆరెస్ మధ్య అవగాహన ఉందనుకోవాలన్నారు. జమ్మూ కాశ్మీర్, తమిళనాడు , మహారాష్ట్ర లో పొత్తులు పెట్టుకొని బీజేపీ కుటుంబాలను చీల్చిందన్నారు. తెలంగాణలో లిక్కర్ కేసు అంటూ కవితను జైలుకి పంపించారని, చివరగా ఆమె సొంత పార్టీ పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని నారాయణ అన్నారు.
స్వతంత్రతను కోల్పోయిన సీబీఐ: ఎమ్మెల్యే కూనంనేని
సీబీఐ తన స్వతంత్ర తను కోల్పోయిందని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. స్వతంత్రంగా ఉండాల్సిన సీబీఐ కేంద్ర ప్రభుత్వ ప్రలోభాలకు లొంగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై పారదర్శక విచారణ చేయాలన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తిరిగి చేపట్టాలపి ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ – బీ ఆరెస్ మధ్య సంబంధం ఉందన్నారు. ఉపరాష్ట్ర పతి ఎన్నికలో బీ ఆర్ ఎస్ ఎవ్వరికి ఓటు వేస్తుందో చెప్పాలన్నారు. బీజేపీ ని నమ్ముకుంటే బీ ఆరెస్ భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. గతంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వెంకయ్య నాయుడు మద్దతు ఇచ్చారని, ఇప్పుడు అదే జస్టీస్ సుదర్శన్ రెడ్డిని దేశానికి శత్రునిలా చిత్రీకరిస్తున్నారని అన్నారు.