ఆ రాష్ట్రాల్లో.. బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేయడంతోనే సేఫ్‌

మధ్యప్రదేశ్‌లో, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీని ఎదుర్కోవడం విఫలమైంది. ఈ నాలుగు రాష్ట్రాలలోని (29+26+ 4+ 5= 64) కాంగ్రెస్‌ బీజేపీతో నేరుగా తలపడింది. ఈ నాలుగు రాష్ట్రాల్లోనే బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది.

ఆ రాష్ట్రాల్లో.. బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేయడంతోనే సేఫ్‌

మధ్యప్రదేశ్‌లో, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీని ఎదుర్కోవడం విఫలమైంది. ఈ నాలుగు రాష్ట్రాలలోని (29+26+ 4+ 5= 64) కాంగ్రెస్‌ బీజేపీతో నేరుగా తలపడింది. ఈ నాలుగు రాష్ట్రాల్లోనే బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చిన సగం సీట్లను కైవసం చేసుకున్నా బీజేపీ 200-210 సీట్ల దగ్గరే ఆగిపోయేది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత సమీక్ష చేసుకోవాల్సింది. సీనియర్లు, జూనియర్లను సమన్వయం చేయాల్సింది. కానీ ఆ పని చేయలేదు. కమల్‌నాథ్‌ ప్రభుత్వం కూలిపోయాక సీఎం అయిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇస్తారా? లేదా అన్న చర్చ దాకా తీసుకెళ్లింది. పార్టీనే ముఖ్యం వ్యక్తులు కాదనే సందేశం ఇచ్చింది.

కానీ కాంగ్రెస్‌ ఒకప్పుడు బలంగా ఉండి అధికారంలో ఉన్న రాష్ట్రాలను కోల్పోవడంమే కాకుండా లోక్ సభ ఎన్నికల్లో ఏమాత్రం పోటీ ఇవ్వలేని స్థితి దాకా వచ్చినట్టు ఈ ఫలితాలను చూస్తే అర్థమౌతుంది. దేశానికి నాయకత్వం వహించే పార్టీ ముందు సొంతపార్టీలోని లోపాలను గుర్తించాలి. ప్రక్షాళన చేయాలి. 2019లోనూ యూపీలో కాంగ్రెస్‌ సొంతంగా పోటీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాగే పోటీ చేసి ఘోరంగా దెబ్బతిన్నది. కానీ ఈసారి సీట్ల సర్దుబాటు చేసుకుని సమన్వయంతో పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో యూపీ ఇండియా కూటమికి సీట్లే నిదర్శనం. చివరి నిమిషంలో ఆర్‌ఎల్‌డీ బైటికిపోయినా, బీఎస్పీ ఇండియా కూటమికి వ్యతిరేకంగా పరోక్షంగా పనిచేసినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కాబట్టి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణలో తగ్గడానికి కారణాలు, హిమాచల్‌ ప్రదేశ్‌లలో పాటు మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌లో పార్టీ తుడిచిపెట్టుకుపోవడంపై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది.