BRS MLA Padi Kaushik Reddy | ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ధ ఉద్రిక్తత
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి(BRS MLA Padi Kaushik Reddy) సంబంధించిన హైదరాబాద్ కొండాపూర్ లోని ఇంటి వద్ధ ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ప్రెస్‌మీట్ లో కౌశిక్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు.
BRS MLA Padi Kaushik Reddy | విధాత : ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ(NSUI) శ్రేణులు దాడి చేస్తారనే అనుమానంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత విమర్శలు చేయడంపై భగ్గుమంటున్న కాంగ్రెస్ శ్రేణులు ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేస్తున్నాయి. కమలాపూర్, బంజారాహిల్స్, రాజేంద్రర్ నగర్, షాదనగర్, హుజురాబాద్ పీఎస్ లలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సీఎం రేవంత్ రెడ్డి హీరోయిన్ల ఫోన్లను ప్రైవేట్ హ్యాకర్లతో ట్రాప్ చేయిసున్నారని..వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని…16మందితో తిరిగిన రేవంత్ రెడ్డి భాగోతాన్ని బయటపెడుతానంటూ కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు వివాదస్పదంగా మారాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram