కవితపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

కవిత కొత్త పార్టీ పెట్టడం బిగ్ జోక్ అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కుటుంబ ఆధిపత్య పోరే దీనికి కారణమని విమర్శించారు.

కవితపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఒక బిగ్ జోక్ వంటిదని, టీఆర్ఎస్ పేరుతో ఆమె పార్టీ పెట్టడం ఇంకో జోక్ అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కవిత ముందుగా తను ఒక ఉద్యమ కారుడైన కేసీఆర్ బిడ్డ అనేది గుర్తుంచుకోవాలన్నారు. కూతురికి తండ్రి అంటే ప్రేమ, గౌరవం ఉండాలని..కొత్త పార్టీ మొదటి సమావేశంలోనే తండ్రిని తిట్టి మర్యాద పోగొట్టుకుందన్నారు. తండ్రికి విలువ ఇవ్వని మనిషి.. రాష్ట్ర ప్రజలకు అమ్మ ఎలా అవుతుందని ప్రశ్నించారు. అన్న మీద ఉన్న కోపం తండ్రి మీద తీయడం తప్పు అన్నారు. కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్తా..కవిత పార్టీ పెట్టడానికి కారణమైందన్నారు. హరీశ్, కేటీఆర్, కవితలకు కేవలం కేసీఆర్ తోనే గుర్తింపు వచ్చిందని గుర్తించుకోవాలని తెలిపారు.

మద్యం కుంభకోణంలో కవితకు ఇంకా క్లీన్ చిట్ రాలేదు అని, ఆమె నిర్దోషి అని తేలనే లేదు అని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ నడిపినంత సులువు కాదు అన్నారు. పార్టీ కాదు కదా తను సొంతంగా పోటీ చేసినా డిపాజిట్ రాదు అన్నారు. మంత్రి పదవిపై ఎన్నికల సందర్బంగా అధిష్టానం నాకు హామీ ఇచ్చింది అని, నాకు పెద్ద పదవి ఇస్తే ఆ పదవికి న్యాయం చేస్తానని, ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే అవకాశం దక్కుతుందన్నారు.

ఇవి కూడా చదవండి :

సెన్సేషన్..ఆ పక్షి పిల్ల కనిపించడం లేదు!
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ : హరీశ్ రావు