సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బిగ్ ఛాలెంజ్

రూ.2,500 మహిళా ఆర్థిక సాయం హామీ అమలు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బిగ్ ఛాలెంజ్ విసిరారు.

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిగ్ ఛాలెంగజ్ విసిరారు. రేవంత్ రెడ్డి తన ఎన్నికల హామీ మేరకు రూ.2,500ఆర్థిక సహాయం చొప్పున ఐదేళ్లకు 1 కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షలు వేస్తే.. నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ కేటీఆర్ సవాల్ చేశారు. ఇప్పటికే వారందరికి రూ.75వేలు బకాయి పడ్డాడని గుర్తు చేశారు. వంద రోజుల్లోనే హామీలన్ని అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఏ స్కీమ్ తెచ్చినా.. దాని వెనుక ఓ స్కామ్ ఉంటుందన్నారు. ఆయన కన్ను మెట్రో భూములపై పడింది, లంకె బిందెల కోసం తిరుగుతున్నాడన్నారు. మెట్రో దగ్గర రూ.30 వేల కోట్లు విలువ చేసే 280 ఎకరాల భూములు ఉన్నాయని, అన్నదమ్ములకో, బావమరిదికో, అల్లుడికో ఆ భూములు కట్టబెట్టడానికి రేవంత్ వ్యూహాలు పన్నుతున్నాడని ఆరోపించారు.

మెట్రోపై రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయం

2023లో కేసీఆర్ ప్రభుత్వంలో రాయదుర్గం నుండి ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో కోసం టెండర్లు పిలిచి అంతా సిద్ధం చేస్తే.. రేవంత్ రాగానే మెట్రో రద్దు అని తుగ్లక్ నిర్ణయం తీసుకున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. ఎక్కడో యూపీలో చిన్న చిన్న పట్టణాలకు మెట్రోను ఇచ్చిన బీజేపీ, లక్డీకాపూల్ నుంచి పటాన్‌చెరు వరకు ఇవ్వలేదు అన్నారు. రెండున్నర ఏండ్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొత్త డ్రామా మొదలుపెట్టారని, మళ్లీ మెట్రో పట్టాలు ఎక్కాలంటే 2028లో కేసీఆర్ రావాల్సిందేనన్నారు. ఎల్ఆండ్ టీ కట్టాల్సిన రూ.14వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రజలపై మోపాడని కేటీఆర్ ఆరోపించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తానని, ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తాని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటికి ఇవ్వకపోగా..మహిళల మెడలో ఉన్న పుస్తెల తాళ్లు కూడా దోచుకునే దండుపాళ్యం ముఠాగా మారిందని విమర్శించారు.

రేవంత్ రెడ్డి సగం తుగ్లక్..సగం హిట్లర్

రేవంత్ రెడ్డి సగం తుగ్లక్..సగం హిట్లర్ లాగా ఉన్నాడని, హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చేందుకు హిట్లర్ ఆదర్శం అంటాడని, ఇప్పటికే కొన్ని వేల ఇళ్లను కూల్చేశాడని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం నడవడం లేదు.. మాఫియా నడుస్తోందని, ఏ పనికైనా పైసలు లేనిదే పని కావడం లేదు అన్నారు. మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే కొంతమంది ఐఏఎస్ అధికారులు బ్రోకర్ గిరీ చేస్తున్నారని,
ముఖ్యమంత్రి కౌంటర్ల దగ్గర ఉండే బ్రోకర్లను కలిసి డబ్బులు కడితేనే ఐఏఎస్ అధికారులు బిల్డర్లకు పర్మిషన్లు ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ – రేవంత్ ట్యాక్స్ అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సినిమా రాష్ట్రంలో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు.

Latest News