విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు పాదయాత్ర చేస్తానంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటనపై పీసీసీ చీఫ్ బి.మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ పాదయాత్రలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, బీఆర్ఎస్ హయాంలో జరిగిని దోపిడి, అవినీతి అంశాలను ప్రజలకు చెప్పి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హాయంలో సింగరేణిలో, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ సహా పలు అవినీతి అక్రమాలతో సాగించిన అవినీతి చెరిపేస్తే చెరిగిపోయేది కాదు అన్నారు. కాంగ్రెస్ లో ప్రస్తుతం ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ క్రమశిక్షణ అంశంలో రాజీలేదు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ పెట్టిన స్వాగతిస్తాం అన్నారు.
వచ్చే ఎన్నికల్లో…కాంగ్రెస్‌కు ఎవరూ పోటీ లేరు అని, బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చినా.. బీఆర్ఎస్ గా ఉన్నా మా పార్టీకి ఏం కాదు అన్నారు. ఆ పార్టీలు మళ్లీ మొలకెత్తే అవకాశం లేదు అని, బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసినా మాదే అధికారం అని మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరీ సైతం కేటీఆర్ పాదయాత్రపై సెటైర్లు వేశారు. ఆయన పాదయాత్ర చేసినా…పరుగెత్తే యాత్ర చేసినా కాంగ్రెస్ కు ఏం కాదని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి :
Bharata Varsha | గోపీచంద్ ‘భరతవర్ష’ టైటిల్ గ్లింప్స్ విడుదల.. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ మూవీ
రేవంత్ ప్రభుత్వ పనితీరుపై మాజీ మంత్రి పోచారం ఫైర్ !
