Jolla Smartphone : ప్రైవసీ కావాలా ఈ మొబైల్ బెస్ట్
ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చే జొల్లా ఫోన్, లైనక్స్ ఓఎస్ తో, డేటా ట్రాకింగ్ లేకుండా, ఆండ్రాయిడ్ యాప్స్ తో సులభంగా వాడుకునే అవకాశం ఇస్తుంది.
మానం మార్కెట్ లో ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఓఎస్ లు ప్రపంచ మొబైల్ మార్కెట్ లో రాజ్యమేలుతున్నాయి. కొద్ది సంవత్సరాల ముందు బ్లాక్ బెర్రీ, విండోస్ ఓఎస్ తో ఫోన్లు వచ్చేయి. ఈ పోటీని తట్టుకోలేక అవి చతికిలపడ్డాయనే చెప్పాలి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ తో విసిగిపోయిన వారికి ప్రత్యామ్నాయ టెక్నాలజీతో జొల్లా ఫోన్ మార్కెట్ లోకి ప్రవేశించింది. లైనక్స్ ఓఎస్ తో ఇది పనిచేయనున్నది. యురోపియన్ మార్కెట్ లో గత 12 సంవత్సరాలుగా ఈ కంపెనీ మొబైల్ ఫోన్లను విక్రయిస్తూ వినియోగదారుల అభిమానం పొందింది. ఈ కంపెనీ వినియోగదారుడి నుంచి ఏ విధమైన డేటా దొంగిలించదు. అలాగే నిరంతరం ఫోన్ ను ట్రాక్ చేయదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు డేటాను నిరంతరం కలెక్టు చేస్తున్నాయి. దీంతో వినియోగదారుడికి ప్రైవసీ లేకుండా పోయింది. వ్యక్తిగత గోప్యత కావాలని అనుకునే వారు జొల్లా ఫోన్ కు మళ్లడం బెటర్ అంటున్నారు సాంకేతిక నిపుణులు. యాప్ మార్కెట్ లో కూడా ఐఓఎస్, గూగుల్ యాప్స్ మొబైల్ ప్రపంచాన్ని నియంత్రిస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా విండోస్, మీ గో ఉన్నప్పటికీ నిలదొక్కుకోలేకపోయాయనే చెప్పాలి. అయితే జొల్లా ఫోన్ మాత్రం ఆండ్రాయిడ్ యాప్స్ ను వినియోగించుకుంటుంది. జొల్లా యాప్ సపోర్టు ద్వారా గూగుల్ యాప్స్ ను డౌన్ లోడు చేసుకుని వాడుకోవచ్చు. వ్యక్తిగత గోప్యత కావాలని అనుకునేవారు సెట్టింగ్స్ ను నిలిపివేసి వాడుకునే వెసులుబాటు ఉంది. ప్రైవసీ కోసం ఫొన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి కెమెరా, మైక్రో ఫోన్, బ్లూ టూత్, సెన్సార్లను డిసెబుల్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతం మూడు రంగులలో, బ్యాటరీ తీసివేసే విధంగా అందుబాటులో లభిస్తున్నాయి. 5జీ కనెక్టివిటీ, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ, 6.36 ఆమోలెడ్ డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 50 మెగా ఫిక్సెల్, 13 మెగా ఫిక్సెల్ కెమెరాలు, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ల ధరలు రూ.62,960 నుంచి రూ.73,480 మధ్య ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
Mario Trailer : నవ్విస్తున్న ‘మారియో’ ట్రైలర్
Telangana Global Rising Summit : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడుల జోరు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram