Moto G37 Power | భారీ బ్యాటరీతో మోటరోలా నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు.. మే19న లాంచ్!

Moto G37 Power | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా భారత్‌లోకి రెండు కొత్త మొబైళ్లను తీసుకొస్తోంది. Moto G37, Moto G37 Power స్మార్ట్‌ఫోన్లను మే 19వ తేదీ మధ్యా్హ్నం 2 గంటలకు అధికారికంగా విడుదల చేయనుంది.

Moto G37 Power | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా భారత్‌లోకి రెండు కొత్త మొబైళ్లను తీసుకొస్తోంది. Moto G37, Moto G37 Power స్మార్ట్‌ఫోన్లను మే 19వ తేదీ మధ్యా్హ్నం 2 గంటలకు అధికారికంగా విడుదల చేయనుంది. ఇప్పటికే యూరప్ మార్కెట్‌లోకి విడుదలైన ఈ మొబైల్స్ ఇప్పుడు భారత్‌లోకి వస్తుండటంతో టెక్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

బ్యాటరీ విషయానికి వస్తే Moto G37 Power‌లో ఇదే ప్రధాన హైలైట్‌గా చెప్పవచ్చు. ఇందులో 7000mAh సామర్థ్యంతో కూడిన శక్తివంతమైన బ్యాటరీని ఇచ్చారు. 30W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్టు చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే మూడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని మోటరోలా కంపెనీ వెల్లడించింది. అదే Moto G37 మోడల్‌లో 5200mAh బ్యాటరీని అందిస్తున్నారు.

ఇక భారత్‌లో విడుదల చేయనున్న ఈ రెండు మొబైల్స్‌లో యూరప్ వేరియంట్లలో ఉన్న MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌కు బదులుగా, మరింత శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను అందిస్తుండటం విశేషం. దీనివల్ల గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనుల్లో మెరుగైన పనితీరు లభించే అవకాశం ఉంది.

Moto G37, Moto G37 Power రెండు ఫోన్లలో కూడా 6.67 అంగుళాల HD+LCD డిస్‌ప్లే వస్తుంది. ఇవి 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నాయి. అదనంగా Corning Gorlla Glass 7i రక్షణతో వస్తున్నాయి. దీనివల్ల స్క్రీన్ మరింత సేఫ్‌గా ఉండనుంది. ఈ రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి.

కెమెరా విషయానికి వస్తే.. 50మెగాపిక్సెల్ మెయిర్ రియర్ కెమెరా ఉంది. ఇది క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. అలాగే. స్టీరియో స్పీకర్లు, Dolby Atmos, Hi-Res Audio వంటి ఫీచర్లు వినియోగదారులకు మెరుగైన ఆడియో అనుభవాన్ని అందించనున్నాయి. ఇందులో గరిష్టంగా 12జీబీ వరకు ర్యామ్ ఉండనుంది.

ధరల విషయానికి వస్తే.. యూరప్ మార్కెట్‌లో Moto G37Power ధర సుమారు రూ.31 వేల వరకు ఉండగా.. Moto G37 ధర సుమారు రూ.27వేలుగా ఉంది. భారత్‌లో కూడా వీటి ధరలు ఇదే శ్రేణిలో ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read More:

శాంసంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్.. గత మోడల్‌తో పోలిస్తే పెద్ద డిస్‌ప్లే, ప్రీమియం లుక్!

భారత్‌లోకి వచ్చేసిన మోటరోలా తొలి బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరాతో లాంచ్!

Latest News