Truecaller | నేటి నుండి ట్రూకాలర్ అవసరం లేదు
తెలియని నెంబర్ల నుండి వచ్చే కాల్స్ మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. తెలిస్తే కాల్ లిఫ్ట్ చేయం కదా అని ట్రూకాలర్ లాంటి అత్యంత ప్రమాదకర యాప్‌లను ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇక ఆ అవసరం లేదు. ఎవరు కాల్ చేసారో ట్రూకాలర్ కంటే ఖచ్చితమైన సమాచారం ఇకనుండి ఏ యాప్ లేకుండానే మనకు తెలిసిపోతుంది.
ఎన్నో విచిత్రమైన కాల్స్, స్పామ్ కాల్స్, మార్కెటింగ్ కాల్స్, ఫిషింగ్ కాల్స్, సైబర్ ఫ్రాడ్ కాల్స్..ఇలా (Spam Calls, Phishing Calls, Cyber Fraud) ప్రతీరోజూ మనం ఎన్నో తెలియని నెంబర్లనుండి కాల్స్ రిసీవ్ చేసుకుంటాం. చాలాసార్లు చిరాకు, కొన్ని సార్లు ప్రమాదం తెచ్చే కాల్స్ కూడా ఉంటాయి. ఆ కాల్ ఎవరినుండి వస్తోందో ముందే తెలిసిపోతే ఇక ఆ కాల్‌ను మనం ఎత్తం కదా. అందుకే ట్రూకాలర్ (Truecaller) అనే ఒక చైనా యాప్ వంద కోట్లకు పైగా ఫోన్లలోకి ప్రవేశించింది.
ట్రూకాలర్.. భారత్‌లో బాగా పేరుపొందిన యాప్. మనకు తెలియని నెంబర్ల నుండి వచ్చే కాల్స్‌ను నిరోధించుకోవడానికి ఈ ట్రూకాలర్ యాప్‌ను పెద్దఎత్తున మొబైల్ వినియోగదారులు వాడుతున్నారు. ట్రూకాలర్ ద్వారా ఆ నెంబర్ ఎవరిదో తెలియడమే కారణం. కానీ అది 100శాతం ఖచ్చితమైన సమాచారం కాదు. ట్రూకాలర్ యాప్ మనం మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోగానే మన ఫోన్‌బుక్‌లో ఉన్న కాంటాక్ట్స్(Phone Book) అన్నింటినీ అది స్టోర్ చేసుకుంటుంది. అంతేకాక, చైనా(China)లో ఉన్న తన సర్వర్లకు పంపుతుంది. ఇలా ఇన్స్టాల్ అయిఉన్న అన్నీ ఫోన్ల నుండి కాంటాక్ట్ సమాచారం సేకరించి మళ్లీ తిరిగి మనకే ఇస్తుంది. మనం బాగా గమనిస్తే, కొన్ని పేర్లు విచిత్రంగా ఉంటాయి. భాస్కర్ చాచా, లిల్లీ డార్లింగ్, గ్రాండ్ మదర్..ఇలా.. ఎందుకంటే ఆ నెంబర్‌ను తెలిసిన వారెవరో ఇలాగే తమ ఫోన్‌బుక్‌లో సేవ్ చేసుకుని ఉంటారు. అది అలాగే ట్రూకాలర్‌కు వెళ్లిపోతుంది. ఆ నెంబర్ నుండి మనకు కాల్ వచ్చినప్పుడు ట్రూకాలర్‌లో ఉన్న డాటానే మనకు డిస్ప్లే అవుతుంది. కానీ, ట్రూకాలర్ అక్కడితో ఆగదు. ఫోన్లో ఉన్న సమస్త సమాచారాన్ని దొంగిలిస్తోంది. ఈ కారణంగానే భారత రక్షణ(Indian Defence Agencies) శాఖ ఈ యాప్‌ను నిషేధించింది. త్రివిధ దళాలు, ఏజెన్సీలు, సున్నితమైన విభాగాల్లో పనిచేసేవారెవరూ ఈ యాప్‌ను వాడొద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నిజానికి మనం కూడా ఈ యాప్ వాడకూడదు. ఇది చాలా డేంజరస్ యాప్. India Defence banned Truecaller.

కొన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు, ఉదాహరణకు సామ్సంగ్(Samsung) తన వినియోగదారులకు స్మార్ట్ కాలింగ్(Smart Calling) అనే సేవను అందిస్తోంది. అయితే అది సామ్సంగ్ ఫోన్లు వాడేవారి నుండి కాల్ వస్తేనే ఆ పేరు మనకు తెలుస్తుంది. గూగుల్(Google) కూడా రివర్స్ లుక్అప్ పేరుతో తన ఆండ్రాయిడ్ సర్వీసుల్లో అందుబాటులో ఉన్న ఫోన్ నెంబర్ల ఆధారంగా ఈ సర్వీసును ఇద్దామని తొలుత అనుకుంది కానీ, ప్రస్తుతం గూగుల్ నుండి దీనిపై ఎటువంటి సమాచారం లేదు.

దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ఓ మార్గం ఆలోచించింది. టెలికం సర్వీస్ ప్రొవైడర్ల(TelecomService Proider)నే ఈ సౌలభ్యాన్ని అందించమని ఆదేశిస్తే..? దాని ఫలితమే కాలర్ నేమ్ ప్రజెంటేషన్ సర్వీస్(Caller NAme Presentation – CNAP) . ప్రతీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ (MSP) సిమ్ కార్డ్(SIM Card) ఇచ్చేముందు ఆధార్ కాపీ(Aadhaar), ఫోటో, వేలిముద్రలు అడుగుతారు. ఆధార్ వెరిఫై అయితేనే అదే పేరుతో మొబైల్ కనెక్షన్ ఇస్తారు. సరిగ్గా ఆ నిబంధననే వాడుకుని కనెక్షన్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్‌పై వారి వద్ద ఉన్న పేరునే కాల్ రిసీవర్ ఫోన్లో కనిపించేవిధంగా ఏర్పాటు చేయాల్సిందిగా ట్రాయ్(TRAI – Telecom Regulatory Authority of India) అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల(Jio, Airtel, Vodafone, BSNL)ను ఆదేశించింది. అయితే, ఈ నిబంధనను ప్రొవైడర్లు ముందు వ్యతిరేకించాయి. కానీ, కేంద్రం(Govt. of India), ట్రాయ్(TRAI) ఒత్తిడి మేరకు తలొగ్గి, CNAP ఏర్పాట్లు చేసుకోనారంభించాయి. ఇప్పటికే ముంబయి, హర్యానాలలో ట్రయల్స్ నిర్వహించిన ఎంఎస్పీలు దేశవ్యాప్తంగా ఈ సీనాప్(CNAP) సేవలను జులై 15(July 15, 2024) నుండి అందించడానికి సిద్ధం కావాలని ట్రాయ్ ఆదేశించింది. దీని ప్రకారం రేపటి నుండి మన కాంటాక్ట్స్‌లో లేని నెంబర్ల నుండి కాల్ వస్తే, ఆ నెంబర్‌కు సంబంధించిన ఆధార్ ధృవీకరణ ఆధారంగా పేరు కనబడుతుంది. ఇక అప్పుడు ఆ కాల్ ఎత్తాలా? వద్దా? అనేది మన ఇష్టం.

జులై 15, 2024 నుండి ఈ సేవలు దేశవ్యాప్తంగా అందించాలని ట్రాయ్ ఆదేశాలున్నప్పటికీ, ఎంఎస్పీలు రేపటి నుండి అందిస్తున్నాయా, లేదా అనేదానిపై స్పష్టత లేదు. చూద్దాం.. రేపు మన ఫోన్లలో పేర్లు కనబడితే సర్వీస్ మొదలైనట్లు, లేకపోతే ఇక ఎప్పుడో..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram