Oneplus Nord CE 6 Lite | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన నార్డ్ సిరీస్‌లో కొత్త మోడల్‌ను భారత్‌లోకి తీసుకొస్తుంది. Nord CE 6, Nord CE 6 Lite మోడళ్లను మే 7వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న నార్డ్ CE 6 మొబైల్ మోడల్‌కు ఇది కొనసాగింపుగా వస్తుంది.
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సిరీస్‌ను మే 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. రెండేళ్ల తర్వాత లైట్ సిరీస్‌లో ఈ మొబైల్ వస్తుండటంతో దీనిపై యూజర్ల ఆసక్తి పెరిగింది. కాగా, నార్డ్ CE 6 మొబైల్ Fresh Blue, Lunar Pearl, Pitch Black కలర్ ఆప్షన్లలో వస్తుంది. నార్డ్ CE 6 లైట్ మోడల్ Vivid Mint, Hyper black కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది.
ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే.. Nord CE 6 మోడల్‌లో Snapdragon 7s Gen 4 ప్రాసెసర్‌ను అమర్చినట్లు వన్‌ప్లస్ కంపెనీ వెల్లడించింది. అదనంగా టచ్ రిఫ్లెక్ట్ చిప్ కూడా జోడించి, డ్యూయల్ చిప్ ఆర్కిటెక్చర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. దీనివల్ల ఫోన్ వేగంగా స్పందించడమే కాకుండా గేమింగ్, మల్టీటాస్కింగ్ సమయంలో స్మూత్ పనితీరు లభిస్తుందని పేర్కొంది.
వేడిని కంట్రోల్ చేసేందుకు కూలింగ్ చాంబర్
ఈ ఫోన్ 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1800 నిట్స్‌పీక్ బ్రైట్‌నెస్, సన్‌లైట్ క్లారిటీ, 144Hz రీఫ్రెష్ రేట్ అందిస్తోంది. గేమింగ్‌కు ప్రత్యేకంగా 144fps సపోర్టు చేస్తుంది. అలాగే 3200Hz టచ్ శాంప్లింగ్ రేట్, 6 యాక్సిస్ గైరోస్కోప్ వంటి ఫీచర్లను అందిస్తుంది. మొబైల్ హీటవ్వకుండా 33వేల చదరపు మిల్లీమీటర్ల విస్తీర్ణంతో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు.
పవర్‌ఫుల్ బ్యాటరీ
బ్యాటరీ విషయానికి వస్తే.. Nord CE6లో 8000mAh భారీ బ్యాటరీని అందిస్తున్నారు. ఇది 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే 2.5 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. 10 గంటల BGMI, 30 గంటల వరకు యూట్యూబ్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. అలాగే బైపాస్ చార్జింగ్, 27W రివర్స్ చార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. డ్యూరబిలిటీ పరంగా ఈ ఫోన్ IP66, IP68, IP69, IP69K రేటింగ్‌తో వస్తున్నాయి. దీంతో దుమ్ము, నీటిని సమర్థంగా నిరోధించగలవు.
కెమెరా స్పెసిఫికేషన్లు
కెమెరా విషయానికి వస్తే.. ఫొటోగ్రఫీ కోసం 50మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో కూడిన డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 8 మెగాపిక్సె్ల్‌తో సెకండరీ కెమెరా ఉన్నట్లు సమాచారం. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది. ఇక ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది.
ధర ఎంత ఉండొచ్చు!
ఈ మొబైల్ ధర, ప్రారంభ ఆఫర్లు వంటి వివరాలను మే 7వ తేదీన జరిగే లాంచింగ్ ఈవెంట్‌లోనే వెల్లడించనున్నట్లు వన్‌ప్లస్ కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫోన్ ధర 23వేలలోపే ఉండొచ్చని సమాచారం. ఆఫర్లతో ఇది రూ.20 వేలకే లభించే అవకాశం ఉంది.
