Oneplus Turbo 6X | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి మరో రెండు కొత్త మొబైళ్లు రాబోతున్నాయి. Oneplus Turbo 6X, Oneplus Turbo 6X Pro మోడళ్లను చైనాలో త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్లకు సంబంధించిన పలు కీలక ఫీచర్లను టీజ్ చేసింది.
వన్‌ప్లస్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. Oneplus Turbo 6X Pro మొబైల్‌లో 8000mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని అందిస్తున్నారు. అలాగే 1.5K రిజల్యూషన్ కలిగిన శాంసంగ్ డిస్‌ప్లేను ఇందులో ఉపయోగించినట్లుగా వన్‌ప్లస్ వెల్లడించింది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 సూపర్ ఎడిషన్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే IP66, IP68, IP69, IP69K రేటింగ్‌తో వస్తుండటంతో ధూళి, నీటి తుంపరల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది.
ఇక Oneplus Turbo 6X మోడల్‌లో 7000mAh బ్యాటరీని అందిస్తున్నారు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 సూపర్ చిప్‌సెట్‌తో రానుంది. ఫోన్‌లో 144Hz రీఫ్రెష్ రేట్ కలిగిన LCD డిస్‌ప్లే వస్తుంది. కళ్లకు హాని తగ్గించే ఫ్లికర్ ఫ్రీ ఐ కేర్ సర్టిఫికేషన్‌ను కూడా ఈ స్క్రీన్ పొందినట్లుగా కంపెనీ తెలిపింది. అదనంగా మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో ఫోన్‌ను రూపొందించినట్లు వెల్లడించింది.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 16 ఆధారిత colorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి. ధర విషయానికి వస్తే ఈ సిరీస్ చైనాలో 1500 యువాన్ విభాగంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు రూ.22 వేల వరకు ఉండొచ్చు.
ఇక Oneplus Turbo 6X ఫోన్ One in a Million, Starry Blac, Threadding on Clouds రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఇక Oneplus Turbo 6X Pro ఫోన్ Black Prancing Horse, Heart’s Desire Oragnge రంగుల్లో రానుంది. అలాగే ఇవి 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్, 8జీబీ+256జీబీ స్టోరేజ్, 12జీబీ+256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. లీకుల ప్రకారం.. Turbo 6X మొబైల్‌లో 6.72 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2మెగాపిక్సెల్ సెకండరీ సెన్సర్, 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది.
