Oppo A6c | ఒప్పో నుంచి మరో బడ్జెట్ మొబైల్.. ధర, ఫీచర్లు లీక్!

Oppo A6c | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లోకి వచ్చిన Oppo A6c మొబైల్‌ను త్వరలోనే భారత్‌లో విడుదల చేయనుందని సమాచారం.

Oppo A6c | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లోకి వచ్చిన Oppo A6c మొబైల్‌ను త్వరలోనే భారత్‌లో విడుదల చేయనుందని సమాచారం. దీనిపై ఒప్పో కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ తాజాగా ఈ ఫోన్‌ ధర, కీలక స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలు లీకయ్యాయి.

ధర ఎంతంటే..!

ప్రముఖ టెక్నాలజీ వెబ్‌సైట్ 91 మొబైల్స్ నివేదిక ప్రకారం.. ఒప్పో ఏ6సీ స్మార్ట్‌ఫోన్ ఈ వారం చివరలో లేదా వచ్చే వారం ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లీకైన సమాచారం ప్రకారం.. దీని ప్రారంభ ధర రూ.13,999గా ఉండే అవకాశం ఉంది. 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో ఈ మొబైల్ రానుంది. అదే 4జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌తో వచ్చే వేరియంట్ ధర సుమారు రూ.16,999గా ఉండొచ్చని అంచనా. అయితే గ్లోబల్ మార్కెట్‌లో కనిపించిన 6జీబీ ర్యామ్ మోడల్ భారత్‌లో విడుదల చేయకపోవచ్చని 91 మొబైల్స్ నివేదిక పేర్కొంది.

రిటైల్ స్టోర్లపైనే ఫోకస్!

Oppo A6c స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఆన్‌లైన్‌లో కంటే ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా మాత్రమే జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో కూడా ఒప్పో ఇలాగే పలు బడ్జెట్ ఫోన్లను విడుదలచేసి సక్సెస్ అయ్యింది. దీంతో చిన్న పట్టణాలు, స్థానిక మొబైల్ రిటైలర్ల ద్వారానే కస్టమర్లకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఒప్పో కంపెనీ ఈ స్ట్రాటజీని అవలంబిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

డిస్‌ప్లే

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.75 అంగుళాల HD+LCD డిస్‌ప్లే ఉండనుంది. 120Hz రీఫ్రెష్ రేటుతో ఈ డిస్‌ప్లే వస్తుంది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉండొచ్చని అంచనా. అలాగే 1,125 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుండటంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.

బ్యాటరీ

అంతర్జాతీ మార్కెట్‌లో విడుదలైన దాని ప్రకారం చూస్తే.. ఈ మొబైల్ 6500mAh భారీ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. ఈ సరికొత్త మోడల్‌లో Qualcomm Snapdragon 685 ప్రాసెసర్ ఉండొచ్చని సమాచారం. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS15పై పనిచేయవచ్చు.

కెమెరా స్పెసిఫికేషన్లు

ఫొటోగ్రఫీ కోసం ఈ మొబైల్‌లో 13మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఇచ్చారు. సెల్పీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చు. ఈ రెండు కెమెరాలు కూడా 1080p వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇవ్వనుంది.

ఇతర ఫీచర్లు

ఈ మొబైల్ డ్యూయల్ నానో సిమ్ సపోర్టుతో వస్తుంది. అలాగే 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్, GPS, USB Type C, OTG వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు కూడా ఉండొచ్చు. IP64 రేటింగ్‌తో వస్తుండటంతో ధూళి, నీటి తుంపరల నుంచి మెరుగైన రక్షణ లభించనుంది.

Read More:

8000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. భారీ అప్‌గ్రేడ్‌లతో రానున్న హానర్ మ్యాజిక్ 9 సిరీస్!

7560mAh భారీ బ్యాటరీ.. 100W ఫాస్ట్ చార్జింగ్‌తో రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..!

 

Latest News