Oppo Reno 16 Pro | త్వరలోనే ఒప్పో నుంచి రెనో 16 ప్రో.. స్పెసిఫికేషన్స్ లీక్!

Oppo Reno 16 Pro | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో కంపెనీ కొత్త మొబైల్‌ను తీసుకురానుంది. Oppo Reno 16 Pro త్వరలోనే భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Reported by: Chandram | సైన్స్​ – టెక్నాలజీ | Apr 30, 2026, 10:32 pm IST
Read Time: 4 mins
Oppo Reno 16 Pro | త్వరలోనే ఒప్పో నుంచి రెనో 16 ప్రో.. స్పెసిఫికేషన్స్ లీక్!

Oppo Reno 16 Pro | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో కంపెనీ కొత్త మొబైల్‌ను తీసుకురానుంది. Oppo Reno 16 Pro త్వరలోనే భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. తాజా లీకులు మాత్రం బయటకొచ్చాయి. టెక్ విశ్లేషకుడు యోగేశ్ బ్రార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మొబైల్ ఈ ఏడాది జూలై లేదా ఆగస్టు మధ్యలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

లీకుల ప్రకారం.. ఈ మొబైల్ 6.32 అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ప్రీమియం గ్లాస్, అల్యూమినియం బిల్డ్‌తో రావడం ద్వారా ఫోన్‌కు ఆకర్షణీయమైన లుక్ ఇవ్వనుంది. వన్‌ప్లస్ ఫోన్లలో కనిపించినట్లుగా ఒక ప్రత్యేక యాక్షన్ బటన్‌ను కూడా ఇందులో అందించే అవకాశం ఉంది.

కెమెరా విషయానికి వస్తే.. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫొటోగ్రఫీని ఇష్టపడేవారిని ఆకట్టుకునేందుకు 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా అందించనున్నట్లు తెలుస్తోంది.

పనితీరు విషయానికి వస్తే.. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ లేదా డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. 12GB, 16GB ర్యామ్ ఆప్షన్లు, అలాగే 256జీబీ, 1టీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. బ్యాటరీ కూడా 6500mAh బ్యాటరీ కంటే ఎక్కువ సామర్థ్యంతో ఈ కొత్త మోడల్ రావచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, పర్‌పుల్, వైట్ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఒప్పో రెనో 16 సిరీస్‌లో రెనో 16 ప్రో మినీ, రెనో 16 ప్రో మ్యాక్స్ మోడల్స్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

ఒప్పో రెనో సిరీస్‌లో వచ్చిన గత మోడల్ 15Pro ఈ ఏడాది జనవరిలో విడదులైంది. దీని ధరను అప్పుడు రూ.67,999గా నిర్ణయించారు. 200మెగాపిక్సెల్ కెమెరా, 6500mAh బ్యాటరీ, డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ వంటి ఫీచర్లతో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఆ ఫీచర్లకు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ మొబైల్ రానున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది.

Read More:

200మెగాపిక్సెల్ కెమెరాతో మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ రాబోతుందా.. స్పెసిఫికేషన్లు లీక్!

Vivo Y600 Pro | 10,200mAh భారీ బ్యాటరీతో వివో స్మార్ట్‌ఫోన్.. చైనాలో లాంచ్, ధర ఎంతంటే..!