Poco C81 | రూ.10 వేల ధరలోనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు.. 6300mAh బ్యాటరీతో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లు!

Poco C81 | పోకో కంపెనీ నుంచి భారత మార్కెట్‌లోకి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి. Poco C81, Poco C81x అనే రెండు మోడళ్లను గురువారం ప్రకటించారు.

Poco C81 | పోకో కంపెనీ నుంచి భారత మార్కెట్‌లోకి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి. Poco C81, Poco C81x అనే రెండు మోడళ్లను గురువారం ప్రకటించారు. బడ్జెట్ ధరలోనే భారీ బ్యాటరీ, మంచి డిస్‌ప్లే ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

ధర ఎంతంటే..

Poco C81 ధరను భారత్‌లో రూ.10,999గా నిర్ణయించారు. 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో ఈ మొబైల్ వచ్చింది. ఇక Poco C81x ధరను రూ.9,999గా ఖరారు చేశారు. ఇది 3జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్‌తో వచ్చింది. ఈ రెండు ఫోన్లు కూడా ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి రానున్నాయి.

కలర్ ఆప్షన్స్

Poco C81x మొబైల్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఎలైట్ బ్లాక్, ఐస్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఇక Poco C81 ఈ రెండు కలర్ ఆప్షన్లతో పాటు అదనంగా సన్‌సెట్ గోల్డ్ రంగులో వస్తుంది.

ఫీచర్లు

Poco C81 మొబైల్‌లో 6.9 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 720*1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో పాటు 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉండటం విశేషం. ఇక Poco C81x మొబైల్‌లో 6.88 అంగుళాల డిస్‌ప్లే ఉంది.

పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఈ రెండు మోడళ్లలోనూ UNISOC T7250 (Octa Core) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ పనులు, సాధారణ గేమింగ్‌కు సరిపోతుంది. ఇక స్టోరేజ్‌ను micro SD ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక Poco C81 ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS3తో పనిచేస్తుంది. Poco C81xలో ఆండ్రాయిడ్ 15 ఉంటుంది.

కెమెరా స్పెసిఫికేషన్లు

కెమెరా విషయంలో Poco C81 మొబైల్‌లో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. Poco C81xలో 13 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంది. ఇక రెండు మొబైల్స్‌లోనూ సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీనే హైలైట్

Poco C81లో బ్యాటరీనే ప్రధాన హైలైట్ అని చెప్పొచ్చు. ఇందులో 6300mAh భారీ బ్యాటరీ ఉండగా.. Poco C81x ఫోన్‌లో 5200mAh బ్యాటరీ ఉంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు రివర్స్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. మొత్తానికి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో వచ్చిన ఈ పోకో ఫోన్లు బడ్జెట్ సెగ్మెంట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read More:

ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 34 గంటలు ఫోన్ మాట్లాడొచ్చు.. రియల్‌మీ నుంచి సరికొత్త 5జీ మొబైల్!

వన్‌ప్లస్ నార్డ్ CE 6 లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..!

Latest News