Smartphone Price Hike | కొత్తగా ఫోన్ కొనేవారికి షాక్.. స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా పెంచిన రియల్మీ.. వన్‌ప్లస్, లావా కూడా!
Smartphone Price Hike | కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి మొబైల్ కంపెనీలు ఊహించని షాకిచ్చాయి. తమ కంపెనీలకు చెందిన మొబైల్ ఫోన్ల ధరలను భారీగా పెంచాయి. రియల్మీ, వన్‌ప్లస్, పోకో, లావా ఇంటర్నేషనల్ కంపెనీలు తమ మిడ్‌రేంజ్, ప్రీమియం ఫోన్లపై ధరలను సవరించాయి. గ్లో
Smartphone Price Hike | కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి మొబైల్ కంపెనీలు ఊహించని షాకిచ్చాయి. తమ కంపెనీలకు చెందిన మొబైల్ ఫోన్ల ధరలను భారీగా పెంచాయి. రియల్మీ, వన్‌ప్లస్, పోకో, లావా ఇంటర్నేషనల్ కంపెనీలు తమ మిడ్‌రేంజ్, ప్రీమియం ఫోన్లపై ధరలను సవరించాయి. గ్లోబల్‌గా మెమొరీ చిప్‌ల కొరత, విడిభాగాల ధరల పెరుగుదల కారణంగానే ఆయా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రియల్మీ ఫోన్లపై ఎంత ధర పెరిగాయంటే..!
ఈ ఏడాది భారత్‌లో విడుదలైన Realme 16 సిరీస్ ఫోన్ల ధరలు గణనీయంగా పెరిగాయి. Realme 16 Base మోడల్ (8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర గతంలో రూ.31,999 కాగా, ఇప్పుడు దాని ధర రూ.33,999కి చేరింది. అంటే రూ.2వేలు పెరిగింది. ఇక 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999.. 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.39,999కి పెరిగింది.
ఇక రియల్మీ 16 ప్రో 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999 ఉండగా.. దాదాపు 5వేలు జరిగింది. దీని ధర రూ.36,999కి చేరింది. 8జీబీ ర్యామ్+256జీబీ వేరియంట్ ధర రూ.39,999.. 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,999కి పెరిగింది. Realme 16 Pro+ 5జీ మొబైల్‌కు సంబంధించి 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియం్ ధర రూ.48,999.. 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.52,999కి చేరింది.

వన్‌ప్లస్, పోకో కూడా.!
వన్‌ప్లస్ కంపెనీ కూడా మరోసారి OnePlus 15R ధరలను సవరించింది. 12జీబీ ర్యాహ్+256జీబీ వేరియంట్‌ను ప్రస్తుతం రూ.54,999కి విక్రయిస్తుంది. ఇది ప్రారంభ ధరతో పోలిస్తే దాదాపు రూ.7వేలు అధికం కావడం గమనార్హం. ఇక 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999కి పెరిగింది.
Poco X8 Pro Max 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,499కి పెరిగింది. 512జీబీ వేరియంట్ ధర రూ.48,999కి చేరింది. అలాగే Poco M8 5జీ స్మార్ట్‌ఫోన్ ధరలు రూ.2వేల వరకు పెరిగాయి. Lava Agni4 మోడల్‌కు సంబంధించి 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చే ఈ ఫోన్ ధర రూ.24,999 నుంచి రూ.29,999కి పెరిగింది.
Read More:
భారీ బ్యాటరీతో మోటరోలా నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు.. మే19న లాంచ్!
శాంసంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్.. గత మోడల్‌తో పోలిస్తే పెద్ద డిస్ప్లే, ప్రీమియం లుక్!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram