IPL 2024 | రాహుల్‌ను బుజ్జగించిన గోయోంకా

IPL 2024 : హైదరాబాద్ చేతిలో దారుణ పరాజయం లక్నో యజమాని గోయెంకాను తీవ్రంగా బాధపెట్టింది. దాన్ని కాస్తా కెప్టెన్ రాహుల్ మీద తీర్చుకున్నాడు. ఆ విషయంపై గోయోంకా విపరీతమైన విమర్శలకు గురయ్యాడు. నష్టనివారణ చర్యలు చేపట్టినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

  • Publish Date - May 14, 2024 / 11:53 PM IST

• వివాదం సమసింది – కొంపమునిగింది
• ఢిల్లీ చేతిలో ఓటమితో ఇంటిముఖం పట్టిన లక్నో

ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) ఢిల్లీతో కీలక మ్యాచ్లో ఓటమికి గురై టోర్నీ నుంచి వైదొలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలనే కసితో ఉన్న లక్నోకు నిరాశ తప్పలేదు. అయితే ఈ సమయంలో లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా(Sanjiv Goenka), కెప్టెన్ రాహుల్(KL Rahul) ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో గొయెంకా, రాహుల్ను ప్రేమగా హగ్ చేసుకున్నట్లు ఉంది. దాంతో, గొయెంకా కీలక మ్యాచ్ ముందు నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది LSG owner Sanjiv Goenka hosts KL Rahul for private dinner. కానీ అది ఎలాంటి మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. లక్నో ఓటమిని ఆపలేకపోయింది.

సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో దారుణ ఓటమి (LSG’s flop show against SRH) అనంతరం కెప్టెన్ రాహుల్ను గోయెంకా మైదానంలోనే ఉతికి ఆరేసాడు. ఆ వీడియో నిమిషాల్లో వైరల్ అయింది. దాంతో, మాజీ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకూ అందరూ గోయెంకా తీరును తీవ్రంగా విమర్శించారు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న గోయెంకా ఆ వివాదానికి ముగింపు పలికాడు. అదీకాక, కీలక మ్యాచ్కు ముందు జట్టులో ఆత్మవిశ్వాసం నింపడం అత్యవసరం అని భావించినట్లున్నాడు. తాజాగా అతడు తన ఇంట్లో రాహుల్కు విందు ఇచ్చాడు. ఆ సందర్భంగా’ హైదరాబాద్లో జరిగిందానికి క్షమాపణ చెపుతూ, ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో రౌండ్లు కొడుతున్నాయి.

ఈనెల 8న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ ఓపెనర్ల ఊచకోతకు లక్నో బౌలర్లు బలిపశువులు కావడం లక్నోను నివ్వెరపరిచింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(89 నాటౌట్), అభిషేక్ శర్మ(75 నాటౌట్)లు సృష్టించిన సునామీ వల్ల, లక్నో నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యం 58 బంతులుండగానే కొట్టుకుపోయింది. దాంతో, కేఎల్ రాహుల్ సేన ఏడో స్థానానికి పడిపోయింది.

Latest News