AUS vs ENG : మూడో టెస్టులో ఇంగ్లాండ్ తడబాటు.. 213/8
యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. ఆసీస్ 371 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ 8 వికెట్లకు 213 పరుగులు చేసి కష్టాల్లో పడింది.
విధాత : యాషెస్ సిరీస్ లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో తడబడి..ఆట ముగిసే సమయానికి 8వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది. 326/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 91.2 ఓవర్లలో 371 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మిచెల్‌స్టార్క్ (54; 75 బంతుల్లో, 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. అంతకుముందు మొదటిరోజు అలెక్స్ కేరీ సెంచరీ (106; 143 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్స్), ఉస్మాన్ ఖవాజా హాఫ్ సెంచరీ (82, 126 బంతుల్లో, 10 ఫోర్లు)లతో ఆసీస్ భారీ స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 5, బ్రైడన్ కార్స్, విల్ జాక్స్ తలో రెండు వికెట్లు, జోష్ టంగ్ 1 వికెట్ తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి 68 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు జాక్ క్రాలీ (9), ఓలీపోప్ (3), జో రూట్ (19), జెమీ స్మిత్ (22), బెన్ డకెట్ (29), విల్ జాక్స్ (6) బ్యాటింగ్‌లో విఫలయ్యారు. హ్యారీ బ్రూక్ (45) పరుగులతో వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఓ దశలో ఇంగ్లాండ్ 54ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 168పరుగులు మాత్రమే సాధించింది. అయితే బెన్‌స్టోక్స్ (45*; 151 బంతుల్లో, 3 ఫోర్లు), జోఫ్రా ఆర్చర్ (30*; 48 బంతుల్లో, 4 ఫోర్లు) 9వికెట్ కు అజేయంగా 45పరుగులు జోడించి ఆదుకున్నారు. ఇంగ్లాండ్ ఇప్పటికీ మరో 158 పరుగులు వెనకబడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్ 3, నాథన్ లైయన్, స్కాట్ బోలాండ్ చెరో రెండు, కామెరూన్ గ్రీన్ ఓ వికెట్ సాధించారు.
ఇవి కూడా చదవండి :
Harish Rao : పంచాయతీ ఎన్నికల ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు
State Election Commission : తెలంగాణలో ఎన్నికల కోడ్ ఎత్తివేత: ఈసీ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram