Dinesh Karthik| బాధని దిగమింగుకుంటూ ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పిన దినేష్ కార్తీక్..!
Dinesh Karthik| ఐపీఎల్ సీజన్ 17 మరి కొద్ది రోజులలో ముగియనుంది. ఇక సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌లో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి తర్వాత బెంగళూరు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పాడు. తన జట్టుకి కప్ అందించలేకపోయానన్న బాధ, ఇక మళ్లీ గ్రౌండ్‌లో ఇంత ఆదరణ దక్కదన్న నిరాశతో దినేష్ కార్తీక్ మైదానాన్ని వీడాడు.అయి
Dinesh Karthik| ఐపీఎల్ సీజన్ 17 మరి కొద్ది రోజులలో ముగియనుంది. ఇక సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌లో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి తర్వాత బెంగళూరు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పాడు. తన జట్టుకి కప్ అందించలేకపోయానన్న బాధ, ఇక మళ్లీ గ్రౌండ్‌లో ఇంత ఆదరణ దక్కదన్న నిరాశతో దినేష్ కార్తీక్ మైదానాన్ని వీడాడు.అయితే ఆర్సీబీ ఓటమి తరువాత విరాట్ కోహ్లీ.. దినేష్ కార్తీక్ దగ్గరకు వచ్చి అతనిని ప్రేమగా ఆలింగంన చేసుకున్నారు. ఇక కోహ్లీతో పాటు డుప్లెసిస్ ఆయన వెంట నడుస్తూ చప్పట్లు కొట్టారు.

నరేంద్ర మోదీ స్టేడియంలో ఇక తన ఐపీఎల్ ప్రస్థానం ముగిసిందని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతూ దినేష్ కార్తీక్ ముందుకు సాగుతుండగా , ఆర్సీబీ కెప్టెన్ డూప్లిసెస్, కోహ్లీతోపాటు ఇతర ఆర్సీబీ ఆటగాళ్లు దినేశ్ కార్తీక్ కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఇక కొద్ది సేపటి పాటు స్టేడియం మొత్తం డీకే నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సీజన్ మొదట్లోనే దినేష్ కార్తీక్ తాను ఐపీఎల్ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.. అయితే డీకే తన రిటైర్మెంట్‌పై అధికారికంగా ఎలా నోట్‌ను రిలీజ్ చేయకపోయిన పరోక్షంగా మాత్రం క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. ఆర్సీబీకి ఘనంగా కప్ అందించాలని అతను భావించగా, అది జరగకపోవడంతో కాస్త నిరాశగా గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.
దినేశ్ కార్తీక్ ఐపీఎల్ లో బెంగళూరుతో పాటు కోల్ కతా, ముంబయి ఇండియన్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆర్సీబీ తరపున ఆడిన ఐపీఎల్ మ్యాచ్ లలో దినేశ్ కార్తీక్ 162.95 స్ట్రైక్ రేట్ తో 937 పరుగులు చేశాడు. ఇందులో 82 ఫోర్లు, 53 సిక్స్ లు ఉన్నాయి. 2024 సీజన్ లో 15 మ్యాచ్ లు ఆడిన అతను.. 36.22 సగటుతో 326 పరుగులు చేశాడు. ఐపీఎల్ మొదలైనప్పటి నుండి దినేష్ కార్తీక్ లీగ్స్ ఆడుతూ వచ్చాడు. ముంబై తరపున ఆడినప్పుడు అతనికి మంచి పేరు వచ్చింది. ఇక ఆర్సీబీ ఫినిషర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.
Thank You DK ❤️#RCBvsRR #RRvsRCB
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) May 22, 2024
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram