IND vs SA T20 Series|కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. గంభీర్ స్థానంలో కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
IND vs SA T20 Series|గంభీర్ టీమిండియా కొత్త కోచ్‌గా ఎన్నికైన తర్వాత మన జట్టు అద్భుతాలు చేస్తుందని అందరు భావించారు. కాని తీవ్రంగా నిరాశపరుస్తుంది. స్వదేశంలో కూడా చెత్త ప్రదర్శన చేస్తూ చీవాట్లు తింటుంది. ఇక మరి కొద్ది రోజుల్లో న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ ఆడనుంది. అది కూడా ఓడిపోతే ఇక భారత్ టీంతో పాటు కోచ్‌ని కూడా ఓ రేంజ్‌లో తిట్టిపోయడం ఖాయం. ఇక ఇదిలా ఉంటే రానున్న రోజులలో భారత్ .. దక్షిణాఫ్రికాతో
IND vs SA T20 Series|గంభీర్ టీమిండియా కొత్త కోచ్‌గా ఎన్నికైన తర్వాత మన జట్టు అద్భుతాలు చేస్తుందని అందరు భావించారు. కాని తీవ్రంగా నిరాశపరుస్తుంది. స్వదేశంలో కూడా చెత్త ప్రదర్శన చేస్తూ చీవాట్లు తింటుంది. ఇక మరి కొద్ది రోజుల్లో న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ ఆడనుంది. అది కూడా ఓడిపోతే ఇక భారత్ టీంతో పాటు కోచ్‌ని కూడా ఓ రేంజ్‌లో తిట్టిపోయడం ఖాయం. ఇక ఇదిలా ఉంటే రానున్న రోజులలో భారత్ .. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌కి టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్(Gambhir) స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ బిజీగా ఉండనున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న అయిదు టెస్టుల సిరీస్ కోసం రోహిత్ సేన నవంబర్ 10న ఆస్ట్రేలియాకి బయలుదేరే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికాలో నవంబర్ 8 నుంచి 13వ తేదీ వరకు సౌతాఫ్రికాతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో గంభీర్ రెండు సిరీస్‌లని కవర్ చేయడం సాధ్యంకాదు కాబట్టి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు కోచింగ్ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) అందుకోనున్నాడని తెలుస్తోంది. ఎన్సీఏ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్ గతంలో కూడా టీమిండియాకు తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన విషయం మనకు తెలిసిందే. నవంబరు 3న దక్షిణాఫ్రికాకి భారత్ టీ20 జట్టు బయల్దేరనుండగా.. ఆస్ట్రేలియా పర్యటన కోసం నవంబరు 10న భారత్ టెస్టు జట్టు వెళ్లనుంది.
లక్ష్మణ్‌కు సహాయక కోచింగ్ సిబ్బందిగా ఎన్సీఏలో ఇతర కోచ్‌లు, స్టాఫ్ అయిన సాయిరాజ్ బహుతులే, హృషికేష్ కంటికర్, శుభదీప్ ఘోష్ పనిచేయనున్నారు. ఎమర్జింగ్ ఆసియా టీ20 కప్‌కు భారత-ఏ జట్టుకు సాయిరాజ్ బహుతులే ప్రధాన కోచ్‌గా పనిచేశారు. కాగా, కివీస్‌తో ఇటీవల వరుసగా బెంగళూరు, పుణె టెస్టులో భారత్ జట్టు దారుణమైన ప్రదర్శన కనబరచడంతో గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో అతనిపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా(Australia) పర్యటన ముంగిట అతనికి తగినంత విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram