India vs Australia : అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్ సెంచరీ

అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 55 బంతుల్లో సెంచరీతో భారత్‌ను భారీ స్కోర్ దిశగా నడిపించాడు.

Reported by: Tejaswini Nanna | క్రీడలు | Feb 06, 2026, 5:18 pm IST
Read Time: 2 mins
India vs Australia : అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్ సెంచరీ

విధాత : అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ లో యువ భారత్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకపడి ఫాస్టెస్టు సెంచరీ నమోదు చేశాడు. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ తో భారత్ 20ఓవర్లకే 180పరుగులు చేసింది. 55బాల్స్ లో నే సెంచరీ పూర్తి చేసి..అండర్ 19 టోర్నమెంట్ లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం 22ఓవర్లు ముగిసే సరికి వైభవ్ సూర్యవంశీ(72బాల్స్ లో 13ఫోర్లు, 13సిక్స్ లతో 145) పరుగులతో ఆడుతున్నాడు. అతనికి తోడుగా వేదాంత్ త్రివేది (7) క్రీజు లో ఉన్నాడు.

భారత్ ఇన్నింగ్స్ లో (3.6) అరోన్‌ జార్జి (9) జట్టు స్కోర్ 20పరుగుల వద్ద అలెక్స్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 18.6ఓవర్లలో 162పరుగుల వద్ద అలెక్స్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో బెన్ మేయెస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఆయుష్‌ మాత్రే(53) ఔటయ్యాడు. వైభవ్ సూర్యవంశీ జోరు చూస్తే భారత్ 50ఓవర్లలో 400పరుగుల స్కోర్ కు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Tiger Tension : పెద్ద పులుల భయంలో తెలుగు రాష్ట్రాలు !
Woman Attack Liquor Shops In UP : లిక్కర్‌ షాపులపై మహిళల మూకుమ్మడి దాడి.. రూ.15 లక్షల విలువైన మద్యం బాటిల్స్‌ ధ్వంసం