క్రికెట్ ఆటకు భారత్ లో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ దేశంలో గల్లీగల్లీకే కాదు…పొలాల వెంట..అపార్ట్ మెంట్ల వద్ద, కాలనీల్లో క్రికెట్ ఆడే పిల్లలు కనిపిస్తుంటారు. చిన్నా పెద్దా అంతా క్రికెట్ ఆడాలన్న, చూడాలన్న అపారమైన మోజు ప్రదర్శిస్తుంటారు. దేశంలో ఎక్కడా చూసినా…క్రికెట్ ఫీవర్ కనిపించే భారత్ లో ఓ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ లు ఏటా ఎందరో పుట్టుకొస్తున్నారు. తాజాగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీ 20 మ్యాచ్ ల్లో తన పవర్ హిట్టింగ్ తో, ధనాధన బ్యాటింగ్ తో ప్రపంచాన్ని అబ్బురపరుస్తూ భారత్ ఫ్యూచర్ స్టార్ గా ఎదుగుతున్న సంగతి తెలిసిందే.

అజ్ఞాత సూర్యవంశీలు ఎందరో…?

ఐపీఎల్ తో వెలుగులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ మాత్రమే కాదు..భారత్ లోని గల్లీల్లో..జనావాసాల్లో ఇంకెందరో అజ్ఞాత సూర్యవంశీలు దాగి ఉన్నారనడంలో సందేహం లేదు. ఇందుకు నిదర్శనం అన్నట్లుగా తాజాగా ఓ చిన్నారి తన ధనాధన్ బ్యాటింగ్ తో మరో సూర్యవంశీ రెడీ అంటు సందేశం ఇస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ నివాస ప్రాంగణంలో బలమైన స్వింగ్‌ హిట్టింగ్, టెక్నిక్‌తో బ్యాటింగ్ చేస్తున్న ఓ చిన్నారి వీడియో ‘ది ఎక్స్’ లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు…ఒక్క వైభవ్ సూర్యవంశీతోనే ప్రపంచ బౌలర్లు ఇబ్బంది పడుతుంటే..ఈ ముద్దుల బాలుడు నెక్ట్స్ సూర్యవంశీ అన్నట్లుగా ధనా ధన్ బ్యాటింగ్ తో బౌలర్లను భయపెట్టేందుకు సిద్ధమవుతున్నాడంటూ అని చమత్కరిస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్, బీహార్ తరఫున ఆడే ఎడమచేతి వాటం టాప్-ఆర్డర్ బ్యాటర్ అయిన వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్ లో 35 బంతుల్లోనే సెంచరీ చేసి..అతి పిన్నవయసులోనే ఐపీఎల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. తాజాగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 29 బంతుల్లో 97 పరుగులు చేశాడు. అండర్ 19 సహా దేశవాళీ పలు టోర్నీల్లోనూ అతిపిన్న వయసులోనే సెంచరీల రికార్డులను నమోదు చేశాడు. అదే బాటలో ఈ వీడియోలోని బాలుడు సైతం తన బ్యాటింగ్ నైపుణ్యంతో కొత్త రికార్డుల సాధనకు సిద్దమవుతున్నట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.