India vs South Africa|దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ టార్గెట్ 549

దక్షిణాఫ్రికాతో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ కు సఫారీలు 549పరుగుల విజయ లక్ష్యాన్ని విధించారు. ఓవర్‌నైట్‌ స్కోర్ 26/0తో నాల్గవ రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్ 260/5 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత 288పరుగులు కలుపుకుని భారత్ కు 549 పరుగుల భారీ టార్గెట్ విధించింది. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ ను ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కే.ఎల్.రాహుల్ లు ప్రారంభించారు.

India vs South Africa|దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ టార్గెట్ 549

విధాత : దక్షిణాఫ్రికాతో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టు( India vs South Africa 2nd Test) లో భారత్ కు సఫారీలు 549పరుగుల విజయ లక్ష్యాన్ని విధించారు. ఓవర్‌నైట్‌ స్కోర్ 26/0తో నాల్గవ రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్ 260/5 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత 288పరుగులు కలుపుకుని భారత్ కు 549 పరుగుల భారీ టార్గెట్ విధించింది. భారీ లక్ష్య చేధనతో బరిలోకిదిగిన భారత జట్టు ఆదిలోనే ఓపెనర్లు జైస్వాల్‌(13), రాహుల్‌(6) వికెట్లను కోల్పోయి కష్టాల్లోపడింది.  ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్   2 వికెట్లు నష్టపోయి 27 పరుగులు చేసింది. భారత్‌ విజయం సాధించాలంటే బుధవారం(చివరి రోజు) 522 పరుగులు చేయాల్సి ఉంటుంది.

దక్షిణాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (94; 180 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ ముంగిట ఔటయ్యాడు. అతను ఔట్ కాగానే సౌతాఫ్రికా డిక్లేర్ చేసింది. టోని డి జోర్జి (49; 68 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) , రికెల్‌టన్ (35), వియాన్ ముల్డర్ (35*), మార్‌క్రమ్ (29) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 489 పరుగులు చేయగా.. భారత్ 201కే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో ముత్తుస్వామి(109), యన్సెన్ (93) పరుగులతో రాణించారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్(58), వాషింగ్టన్ సుందర్(48) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సఫారీ పేసర్ యన్సెన్ 6వికెట్లు సాధించాడు.