INDvsAUS: నువ్వా.. నేనా నేటి నుంచి తొలిటెస్టు! అస్ట్రేలియాకు కొరుకుడు పడని టీమిండియా

INDvsAUS, BGT2023 BorderGavaskarTrophy గాయాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న రెండు జట్లు ఆసీస్ జట్టు నుంచి స్టార్క్, హేజిల్ వుడ్ దూరం..? శ్రేయాస్ అయ్యర్ గాయంతో టీమ్ ఇండియా పరేషాన్.. తొలి రోజు నుంచే స్పిన్ కు అనూలించనున్న నాగపూర్ పిచ్.. స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్, భారత్ వ్యూహాలు.. (విధాత ప్రత్యేకం) నాగపూర్: ప్రపంచ టెస్టు ఫైనల్స్ బెర్త్ తేల్చే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్‌లో […]

  • By: krs    sports    Feb 08, 2023 1:32 PM IST
INDvsAUS: నువ్వా.. నేనా నేటి నుంచి తొలిటెస్టు! అస్ట్రేలియాకు కొరుకుడు పడని టీమిండియా

INDvsAUS, BGT2023 BorderGavaskarTrophy

  • గాయాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న రెండు జట్లు
  • ఆసీస్ జట్టు నుంచి స్టార్క్, హేజిల్ వుడ్ దూరం..?
  • శ్రేయాస్ అయ్యర్ గాయంతో టీమ్ ఇండియా పరేషాన్..
  • తొలి రోజు నుంచే స్పిన్ కు అనూలించనున్న నాగపూర్ పిచ్..
  • స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్, భారత్ వ్యూహాలు..

(విధాత ప్రత్యేకం)

నాగపూర్: ప్రపంచ టెస్టు ఫైనల్స్ బెర్త్ తేల్చే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్‌లో తొలి టెస్టు మ్యాచ్ నేటి ఉదయం 930 నుంచి మొదలవనుంది. యాషెస్ సిరీస్‌లో ఎదురులేదు. సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లపై తిరుగులేదు. ఉప ఖండం జట్లపై పోటీ లేని ప్రదర్శన. కానీ కొరుకుడు పడనిదల్లా ఒకటే టీమ్ ఇండియా.. 2004 తర్వాత ఎన్నిసార్లు సిరీస్ ఆడినా భారత్‌ను భారత్‌లో ఓడించడం కంగారూలకు సాధ్యం కావడం లేదు. అందుకే ఎన్నడూ లేనంతగా ఈసారి పటిష్టమైన జట్టుతో 18 సభ్యుల భారీ బృందంతో బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆడేందుకు కంగారూల జట్టు భారత్ చేరింది.

మరోవైపు రిషభ్ పంత్ యాక్సిడెంట్.. బుమ్రా గాయంతో భారత జట్టు ఫైనల్ ఎలెవన్‌పై అంతా టెన్సన్.. ఇక టెస్టుల్లో అద్భుతమైన ఫాంలో ఉన్న శ్రేయాస్ అయ్యర్ కూడా గాయంతో నాగపూర్‌లో జరిగే తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో భారత్ కూడా ఆందోళనగా ఉంది.. స్పిన్ ట్రాక్ ఉంటుందన్న వార్తలు ఒకవైపు పటిష్టమైన ఆస్ట్రేలియా బ్యాటింగ్ (ఖవాజా, వార్నర్, లబుషేన్, స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీ), బౌలింగ్ (కెప్టెన్ పాట్ కమిన్స్, స్టార్క్, హేజిల్ వుడ్, యువ పేసర్లు) లోనూ కాస్త పైచేయిగా కనిపిస్తుంది.

ఇక స్వదేశంలో టెస్టుల్లో ఇటీవలి కాలంలో అద్భుతమైన ఫాంలో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మకు అగ్నిపరీక్ష. తనకు ఓపెనర్‌గా గిల్ లేదా రాహుల్‌ను ఎంపిక చేయాలా..? లేదా ఆరోస్థానంలో గిల్ లేదంటే సూర్య కుమారా అన్నది తేల్చుకోవాలి. మరోవైపు స్పిన్నర్ల ఎంపిక.. అశ్విన్, జడేజాలకు తోడుగా అక్షర్ లేదా కుల్దీప్ ఎవరికి స్థానం దక్కుతుందో తెలియకుండా ఉంది. ఇక పేసర్లలో లోకల్ బోయ్ ఉమేశ్ యాదవ్‌కు చోటిస్తారా లేదా.. తెలియాల్సి ఉంది.