RCB| ఆర్సీబీకి కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. ఇది ఊహించని పరిణామమే.!
RCB| గత కొద్ది రోజులుగా కేఎల్ రాహుల్ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఏ జట్టుకి ఆడబోతున్నాడు అనే ప్రశ్న ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రస్తుత లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తిరిగి సొంతగూటికి చేరబోతున్నాడనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నమాట. కేఎల్ రాహుల్ ఎల్‌ఎస్‌జీకి 2025 ఐపీఎల్ సీ

RCB| గత కొద్ది రోజులుగా కేఎల్ రాహుల్ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఏ జట్టుకి ఆడబోతున్నాడు అనే ప్రశ్న ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రస్తుత లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తిరిగి సొంతగూటికి చేరబోతున్నాడనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నమాట. కేఎల్ రాహుల్ ఎల్‌ఎస్‌జీకి 2025 ఐపీఎల్ సీజన్ కంటే ముందుగానే గుడ్ బై చెప్పి ఆర్సీబీలోకి వెళ్లనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్ ని 2013లో ఆర్సీబీ పరిచయం చేసింది. 2016లో కూడా ఆర్సీబీ తరఫున ఆడిన కేఎల్ రాహుల్ మంచి ప్రదర్శన చూపాడు.
2017లో గాయం కారణంగా దూరమైన రాహుల్.. ఆ తర్వాత పంజాబ్ జట్టులో చేరాడు. అనంతరం ఎల్ఎస్‌జీ కెప్టెన్‌గా ఉంటూ తమ జట్టుని వరుసగా రెండేళ్లు ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. అయితే, ఐపీఎల్ 2024లో మాత్రం లీగ్ దశ నుంచే ఎల్‌ఎస్‌జీ నిష్క్రమించిన విషయం తెలిసిందే.. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంతో సహనం కోల్పోయిన లక్నో ఫ్రాంఛైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా మైదానంలో టీవీ కెమెరాలు ఉన్నాయనే విషయం కూడా మరిచి రాహుల్ ని మందలించాడు. ఆ సమయంలో కేఎల్ రాహుల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా.. సంజీవ్ గోయెంకా వినిపించుకోలేదు
ఆ పరిణామాలతో కేఎల్ రాహుల్ ఇప్పుడు జట్టు మారబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫాఫ్ డూప్లెసిస్ స్థానంలో ఆర్సీబీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాదు విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ సైతం ఉన్నట్టుగా అర్ధమవుతుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది