MI vs KKR|కోల్‌క‌తా చేతిలో ఘోర ప‌రాజ‌యం.. ఈ ఐపీఎల్‌లో ముంబై ప‌ని ఖ‌తం..!

MI vs KKR| ఐపీఎల్ 2024లో ముంబై ఇండియ‌న్స్ చాప చుట్టేసింది. కొత్త నాయ‌తక‌త్వంలో ఈ సారి బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు కేవ‌లం మూడు మ్యాచ్‌లు మాత్ర‌మే గెలిచింది. గ‌త రాత్రి జ‌రిగిన పోరులో గెలిచి ఉంటే కూస్తో కాస్తో ప్లే ఆఫ్స్ అవ‌కాశం ఉండేది. కాని త‌క్కువ ల‌క్ష్యాన్ని కూడా చేధించ‌లేక‌పో

  • By: sn    sports    May 04, 2024 6:27 AM IST
MI vs KKR|కోల్‌క‌తా చేతిలో ఘోర ప‌రాజ‌యం.. ఈ ఐపీఎల్‌లో ముంబై ప‌ని ఖ‌తం..!

MI vs KKR| ఐపీఎల్ 2024లో ముంబై ఇండియ‌న్స్ చాప చుట్టేసింది. కొత్త నాయ‌తక‌త్వంలో ఈ సారి బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు కేవ‌లం మూడు మ్యాచ్‌లు మాత్ర‌మే గెలిచింది. గ‌త రాత్రి జ‌రిగిన పోరులో గెలిచి ఉంటే కూస్తో కాస్తో ప్లే ఆఫ్స్ అవ‌కాశం ఉండేది. కాని త‌క్కువ ల‌క్ష్యాన్ని కూడా చేధించ‌లేక‌పోవ‌డంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు అధికారికంగా నిష్క్రమించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో వాంఖడే వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పేలవ బ్యాటింగ్‌తో 170 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా చేధించ‌లేక‌పోయింది ముంబై ఇండియ‌న్స్. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టుపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ముందుగా ముంబై ఇండియ‌న్స్ బ్యాటింగ్ చేయ‌గా, కేకేఆర్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. పియూష్ చావ్లాకు ఓ వికెట్ తీసి కేకేఆర్‌ని త‌క్కువ స్కోరుకి క‌ట్ట‌డి చేశారు. కేకేఆర్ జ‌ట్టులో వెంక‌టేష్‌ అయ్యర్(52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) అర్ధ సెంచరీ చేయ‌గా.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన‌ మనీష్ పాండే(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్ద‌రు కాసేపు ముంబై బౌల‌ర్స్‌ని ప్ర‌తిఘ‌టిస్తూ విలువైన ప‌రుగులు రాబ‌ట్టారు. ఇక 170 ప‌రుగుల లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌట్ అయి త‌మ ఖాతాలో మ‌రో ప‌రాజ‌యాన్ని చేర్చుకుంది.

మిచెల్ స్టార్క్ వేసిన రెండో ఓవర్‌లోనే ఇషాన్ కిషన్(13) క్లీన్ బౌల్డ్ కాగా, ఆ కొద్ది సేపటికే నమన్ ధీర్(11)ను వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేసాడు. అనంత‌రం.. రోహిత్ శర్మ(11)సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. దాంతో ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో 3 వికెట్ల నష్టానికి 46 పరుగులే చేసింది. అయితే ఆ స‌మ‌యంలో సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) ఎప్ప‌టి మాదిరిగానే మెరుపులు మెరిపించి హాఫ్ సెంచ‌రీ చేశాడు.తిలక్ వర్మ (4), నేహాల్ వధేరా (6), హార్దిక్ పాండ్యా (1), టిమ్ డేవిడ్ (24) ఇలా స్టార్ బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే వెనుదిర‌గ‌డంతో సూర్య కుమార్ పోరాటం కూడా వృధా అయింది. ఇది ముంబై ఇండియన్స్ 8వ పరాజయం కాగా, ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో ఆ జట్టు గెలిచినా ప్లే ఆఫ్స్ చేరలేదు. ఇక కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(4/33) నాలుగు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలో రెండు వికెట్లు తీసారు.