Dhoni| ఐపీఎల్‌కి రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటిస్తాడో చెప్పేసిన ధోని
Dhoni| భారత క్రికెట్‌లో ధోని సరికొత్త అధ్యాయం లిఖించాడు. ముచ్చటగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న కెప్టెన్‌గా ఖ్యాతి గాంచాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఐపీఎల్ నుండి కూడా ధోని రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తు

Dhoni| భారత క్రికెట్‌లో ధోని సరికొత్త అధ్యాయం లిఖించాడు. ముచ్చటగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న కెప్టెన్‌గా ఖ్యాతి గాంచాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఐపీఎల్ నుండి కూడా ధోని రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నా కూడా దానిపై ఇప్పటి వరకు ధోని స్పందించింది లేదు.. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు నాయకత్వ బాధ్యతల నుంచి ధోని తప్పుకోవడం మనం చూశాం. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఆ బాధ్యతలు అప్పగించాడు. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో చెన్నై ప్లే ఆఫ్స్ చేరుకోనప్పటికి కూడా మంచి ప్రదర్శననే చేసింది. 14 మ్యాచుల్లో ఏడు మ్యాచుల్లో గెలిచి, మరో ఏడు మ్యాచుల్లో ఓడింది. రన్‌రేటులో కాస్త వెనుకపడడంతో ప్లేఆఫ్స్‌కి వెళ్లలేదు కాని లేదంటే ఫైనల్ వరకు వెళ్లి కప్ గెలిచి ఉండేది.
ఐపీఎల్ 2024 సీజన్‌లో సీఎస్‌కే ఆడే చివరి మ్యాచే ధోనీకి ఫేర్‌వెల్ గేమ్ అని అంతా అనుకున్నారు. కానీ ధోనీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా ముందుకు వచ్చాడు. అయితే ఈ ఏడాది చివర్లో మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ధోనీ కొనసాగుతాడా లేదా అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ.. అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ప్రశ్నించగా ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంకా ఐపీఎల్ 2025కి చాలా సమయం ఉంది. ఆటగాళ్ల రిటెన్షన్ విషయంలో బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందోనని మేం ఎదురు చూస్తున్నాం.
మెగా వేలానికి సంబంధించిన రూల్స్, నింబంధనలు రాగనే.. ఐపీఎల్ 2025లో కొనసాగే విషయంపై నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని అన్నాడు. అయితే తాను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది జట్టుకు మేలు చేసేలానే ఉంటుంది అని ధోనీ చెప్పుకొచ్చాడు. అంతకుముందు, ధోని రిటైర్మెంట్ వార్తలను సీఎస్‌కే బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ తోసిపుచ్చారు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ అధికారి మాట్లాడుతూ, ఎంఎస్ ధోని రిటైర్ అవుతున్నట్లు సీఎస్‌కేలో ఎవరికీ చెప్పలేదు. కొన్ని నెలలు వేచి చూడాలని, ఆపై తుది నిర్ణయం తీసుకుంటానని యాజమాన్యానికి చెప్పారని అన్నారు.