ఐపిఎల్ ప్లేఆఫ్స్ లెక్కలు ఇలా..!
ఐపిఎల్ 2024 ప్లేఆఫ్ స్థానాల లెక్కలు ఎటూ తేలడం లేదు. మూడు జట్లు, కోల్కతా, రాజస్థాన్, హైదరాబాద్ ప్లేఆఫ్స్కు చేరినప్పటికీ, ఒక్క కోల్కతా తప్ప మిగిలిన మూడు స్థానాల్లో ఎవరెవరుంటారో చెప్పడం కష్టంగా మారింది. రెండోస్థానానికి రాజస్థాన్, హైదరాబాద్ల మధ్య పోటీ ఉంది. ఇవాళ జరగాల్సిన చెన్నై–బెంగళూరు(CSK vs RCB) మ్యాచ్తో మిగిలిన నాలుగో స్థానం ఎవరిదో తేలిపోతుంది. ప్రస్తుతం ఎవరెవరి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.

ఐపిఎల్ ప్లేఆఫ్స్ లెక్కలు ఇలా..!
ఐపిఎల్ 2024 ప్లేఆఫ్ స్థానాల లెక్కలు ఎటూ తేలడం లేదు. మూడు జట్లు, కోల్ కతా, రాజస్థాన్ , హైదరాబాద్ ప్లేఆఫ్స్ కు చేరినప్పటికీ, ఒక్క కోల్ కతా తప్ప మిగిలిన మూడు స్థానాల్లో ఎవరెవరుంటారో చెప్పడం కష్టంగా మారింది. రెండోస్థానానికి రాజస్థాన్ , హైదరాబాద్ ల మధ్య పోటీ ఉంది. ఇవాళ జరగాల్సిన చెన్నై–బెంగళూరు(CSK vs RCB) మ్యాచ్ తో మిగిలిన నాలుగో స్థానం ఎవరిదో తేలిపోతుంది. ప్రస్తుతం ఎవరెవరి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.

ఆడినవి: 13, పాయింట్లు: 19, రన్ రేట్ : 1.428
కోల్ కతా ప్రస్తుతం 19 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రేపు రాజస్థాన్ తో మిగిలిన మ్యాచ్ ఆడాల్సిఉండగా, తన మొదటిస్థానానికేం ఢోకా లేదు. రాజస్థాన్ కు ఇప్పుడు 16 పాయింట్లు ఉన్నాయి. ఒకవేళ కోల్ కతా గెలిస్తే 21 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. ఓడిపోయినా, రాజస్థాన్ కు 18 పాయింట్లే వస్తాయి కాబట్టి, 19 పాయింట్లతో ఉన్న కోల్ కతా స్థానం నెంబర్ వన్ .

ఆడినవి: 13, పాయింట్లు: 16, రన్ రేట్ : 0.273
ఆదివారం నాడు జరగబోయే మ్యాచ్ లో కోల్ కతాను ఓడిస్తే, 18 పాయింట్లతో రాజస్థాన్ కు రెండో స్థానం ఖరారైనట్లే. ఓడిపోయినా కూడా, ఒకవేళ హైదరాబాద్ , చెన్నై మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయితే( ఈ రెండు మ్యాచ్ లకు వరుణుడి ముప్పు పొంచిఉంది) వాటికి ఒకే పాయింట్ వస్తుంది( హైదరాబాద్ : 16, చెన్నై:15) కాబట్టి, అప్పుడు కూడా రాజస్థాన్ (16) రెండో స్థానంలోనే ఉంటుంది. ఎందుకంటే లీగ్ దశలో రాజస్థాన్ (8)కి, హైదరాబాద్ (7) కంటే ఎక్కువ విజయాలున్నాయి కాబట్టి.రాజస్థాన్ నాలుగోస్థానానికి కూడా పడిపోయే అవకాశముంది. ఎలాగంటే, వీరు కోల్ కతా చేతిలో ఓడిపోయి(16), హైదరాబాద్ పంజాబ్ పై గెలిచి(17), చెన్నై బెంగళూరుపై గెలిస్తే(16) అలా జరుగుతుంది. రెండు జట్లు రాజస్థాన్ , చెన్నై 16 పాయింట్లతో ఉంటాయి కానీ, ఎక్కువ విజయాలు చెన్నైకే ఉంటాయి కాబట్టి, చెన్నై 3వ స్థానంలోనూ, రాజస్థాన్ 4వ స్థానంలోనూ కూర్చుంటాయి.


ఆడినవి: 13, పాయింట్లు: 14, రన్ రేట్ : 0.528
చెన్నై ప్లేఆఫ్స్ కు వెళ్లాలంటే ఒక పాయింట్ చాలు. అంటే, వర్షం పడి మ్యాచ్ రద్దయినా, ప్లేఆఫ్స్ గ్యారెంటీ. ఒకవేళ బెంగళూరుపై గెలిచి, రాజస్థాన్ కోల్ కతా చేతిలో ఓటమిపాలై, హైదరాబాద్ కు ఒక్క పాయింట్ కన్నా ఎక్కువ రాకపోతే చెన్నై గిఫ్ట్ ప్లేస్ కు చేరుకుంటుంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) :
ఆడినవి: 13, పాయింట్లు: 12, రన్ రేట్ : 0.387
ఆర్సీబీ గమ్యం పక్కాగా ఉంది. వారు ఒకవేళ 200 పరుగులు చేయగలిగితే, చెన్నైని 18 పరుగుల తేడాతో ఓడించాలి. చేజింగ్ అయితే 11 బంతులు మిగిలిఉండగానే లక్ష్యాన్ని చేధించాలి. వర్షం పడితే ఇంతే సంగతులు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ కుదించినా, గెలవాల్సిన మార్జిన్ మాత్రం మారదు కాబట్టి, వారు కేవలం గెలుపు మంత్రంతో పాటు వరుణ మంత్రం కూడా జపించాలి వాన పడకుండా.