బ్రాండ్ రాజా.. ధోనీ, మహేశ్ బాబు

క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కూడా ధోనీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. అయితే అది ఆటలో కాదు బ్రాండింగ్‌లో. భారత జట్టులో ఆటగాడిగా ఉన్నపుడే చాలా బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉంటూ ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ చేసిన ఆయన ఇప్పుడు ఆటకు గుడ్‌బై చెప్పి ఐదేండ్లు అయినా తన బ్రాండ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నాడు. అయితే మన దేశంలో మొదటి నుంచి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి టాప్ స్టార్లు దశబ్దాలుగా అనేక బ్రాండ్లకు ప్రమోషన్లు నిర్వహిస్తూ టాప్‌లో దూసుకెళుతున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు వారిని మించి బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో ధోనీ టాప్‌లో దూసుకెళుతున్నాడు. 2024లో ఓ ప్రముఖ మీడియా నిర్వహించిన సర్వే ప్రకారం తొలి 42కు పైగా బ్రాండ్లకు ధోనీ ప్రచారకర్తగా ఉన్నట్లు తెలిపింది. వాటిలో బాత్రూమ్ క్లీనర్స్ నుంచి లగ్జరీ కార్లు, ఎయుర్‌లైన్స్ మరికొన్ని వీదేశీ బ్రాండ్లు కూడా ఉండడం గమనార్హం.
ఇక ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ 41, షారుఖ్ ఖాన్ 34, మహేశ్ బాబు 30, అక్షయ్ కుమార్ 28, గంగూలీ 24, కోహ్లీ 21 రణ్ వీర్ సింగ్ 21 ఎండార్స్‌మెంట్లతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇదిలాఉండగా 42 బ్రాండ్లతో ధోని అగ్ర స్థానంలో ఉన్నప్పటికీ సుమారు రోజుకు 16 గంటల స్క్రీన్ ప్రెజెన్స్‌లో అమితాబ్ టాప్‌లో ఉండగా ధోనికి 14 గంటలు మాత్రమే ఉండడం గమనార్హం.