Virat Kohli|పుట్టిన రోజు నాడు విరాట్ కోహ్లీని జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్
Virat Kohli|తన ఆట తీరుతో రన్‌మెషీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ మైదానంలో సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డును కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీ భారత్‌కు అత్యంత విజయవంత

Virat Kohli|తన ఆట తీరుతో రన్‌మెషీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ మైదానంలో సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డును కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీ భారత్‌కు అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్. మొత్తం 68 మ్యాచ్‌ల్లో 40 గెలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో కేవలం ముగ్గురు కెప్టెన్లకు మాత్రమే ఇంతటి విజయాల రికార్డు ఉంది.అయితే ఈ రోజు 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కోహ్లీకి ఆయన అభిమానులు, పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తుంటే మరి కొందరు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. జుగుప్సాకరమైన రీతిలో విరాట్ కోహ్లీ అభిమానులను రెచ్చగొట్టేలా ‘CHOKLI BLACK DAY’అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ ఆడుతున్న ఆర్‌సీబీ ఇంకా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు మహిళల టీమ్ మాత్రమే విజేతగా నిలవడంతో.. కోహ్లీకి చీరకట్టి మార్ఫింగ్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. ధోనీ ముందు కోహ్లీ పిల్ల బచ్చా అని కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆర్‌సీబీ సంచలన విజయాన్నందుకొని ప్లే ఆఫ్స్ చేరింది. అయితే ఆ సమయంలో ఆర్సీబీ ఆటగాళ్లు, అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. దీనిని మనసులో పెట్టుకున్న కొందరు ఇప్పుడు కోహ్లీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కెప్టెన్‌గా కోహ్లీ సాధించిందేం లేదని, ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదని కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ కంటే రోహిత్ వెయ్యి రెట్లు నయమని ట్రోలింగ్‌కు దిగారు. కోహ్లీ ఓ కుక్క అంటూ కూడా దారుణంగా తిట్టిపోస్తున్నారు.
అయితే విరాట అభిమానులు రోహిత్ ఫ్యాన్స్ కి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు . కోహ్లీ ఆడిన కీలక ఇన్నింగ్స్ వల్లనే టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిందని, రోహిత్ శర్మ చేసిందేం లేదని విమర్శలు చేస్తున్నారు. . కోహ్లీ సక్సెస్‌ను చూసి ఓర్వలేక ట్రోలింగ్‌కు దిగుతున్నారని, వెయ్యి జన్మలెత్తినా.. కోహ్లీ రికార్డులను రోహిత్ అధిగమించలేడని కామెంట్ చేస్తున్నారు.రోహిత్, కోహ్లీలు బాగానే ఉన్నా అభిమానం పేరిట ఇలా ఇద్దరు ఆటగాళ్ల ఫ్యాన్స్ తిట్టుకోవడం చాలా చెత్తగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇద్దరు భారత ఆటగాళ్లు అనే విషయాన్ని మరచిపోకూడదని కూడా కొందరు హితవు పలుకుతున్నారు.