IND vs NZ| ఒక్క బంతి ప‌డ‌కుండానే తొలి రోజు వ‌ర్షార్ప‌ణం..

IND vs NZ| బంగ్లాదేశ్‌పై అద్భుత‌మైన ఆట‌తీరు క‌న‌బ‌రిచి టెస్ట్ సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అదే ఊపుతో న్యూజిలాండ్‌పై కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఎదురు చూపుల‌కి వ‌రుణుడు కాస్త అడ్డుప‌డ్డాడు. ఈ రోజు నుండి బెంగళూరు వేదికగా ప్రా

  • By: sn    sports    Oct 16, 2024 4:22 PM IST
IND vs NZ| ఒక్క బంతి ప‌డ‌కుండానే తొలి రోజు వ‌ర్షార్ప‌ణం..

IND vs NZ| బంగ్లాదేశ్‌పై అద్భుత‌మైన ఆట‌తీరు క‌న‌బ‌రిచి టెస్ట్ సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా(India) అదే ఊపుతో న్యూజిలాండ్‌( new Zealand)పై కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఎదురు చూపుల‌కి వ‌రుణుడు కాస్త అడ్డుప‌డ్డాడు. ఈ రోజు నుండి బెంగళూరు వేదికగా ప్రారంభం కావ‌ల్సిన భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్ట్‌కు వరణుడు అడ్డంకిగా మారాడు. భారీ వర్షం కారణంగా తొలి రోజు ఆటను అంపైర్లు రద్దు చేశారు. కనీసం టాస్(Toss) కూడా పడలేదు. ఉదయం నుంచీ ఆగకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తొలి రోజు ఆట రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశగా మైదానం వీడారు.

తుఫాను కారణంగా కొన్ని రోజులుగా ఇక్కడ భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాతావ‌ర‌ణ సూచ‌న‌ల ప్ర‌కారం రెండు మూడు రోజుల పాటు బెంగ‌ళూరు(Bangalore)లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో వ‌రుణుడు ఈ టెస్టు(Test Match)కు అడ్డంకిగా మారొచ్చని అంటున్నారు. బుధవారం ఉదయం నుంచి వర్షం ఆగకుండా కురుస్తూనే ఉండ‌డంతో క‌నీసం గ్రౌండ్ నుండి కవర్లను తొలగించనే లేదు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పరిస్థితి కాస్త మెరుగువుతుందని భావించినా.. వర్షం తగ్గనే లేదు. దీంతో 2.30 గంటల సమయంలో అంపైర్లు(Umpires) తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ కాసేపటికే మరోసారి కుండపోతగా వర్షం కురిసింది. తొలి రోజు ఆట ర‌ద్దు కావ‌డంతో . రెండో రోజు మొత్తం 98 ఓవర్లు వేయనున్నారు.

అయితే గురువారం (అక్టోబర్ 17) కూడా వాతావరణ పరిస్థితి కూడా ఇలానే ఉండే అవ‌కాశం క‌నిపిస్తుంది. రెండో రోజు కూడా మ్యాచ్ జ‌రిగే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. వారం రోజుల పాటు బెంగళూరులో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే బెంగళూరుతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. దీంతో న్యూజిలాండ్‌తో ఆడాల్సిన తొలి టెస్ట్‌పై సందిగ్ధం నెల‌కొంది. మొత్తం భార‌త్.. న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్ సిరీస్‌లు ఆడ‌నుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకోవాలంటే ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు ఎంతో కీలకం. ఈ సిరీస్ త‌ర్వాత కీల‌క‌మైన ఆస్ట్రేలియా(Australia) సిరీస్ ఉండ‌నుంది.

జట్ల వివరాలు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్).

న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, మైకేల్ బ్రేస్‌వెల్ (తొలి టెస్టుకు మాత్రమే), మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఒరుర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సీర్స్, ఇష్ సోథి (2,3 టెస్టులకు), టిమ్ సౌథి, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.