Roger Binny | టీమిండియా హెడ్‌కోచ్‌గా ముగిసిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం.. కొత్త కోచ్‌పై బీసీసీఐ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు..!
Roger Binny | దాదాపు 17ఏళ్ల సుధీర్ఘ విరామం అనంతరం భారత జట్టు మరోసారి టీ20 వరల్డ్‌కప్‌ను నెగ్గింది. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని రోహిత్ సారథ్యంలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పొట్టికప్‌ను నెగ్గి అభిమానుల కలను సాకారం చేసింది.
Roger Binny | దాదాపు 17ఏళ్ల సుధీర్ఘ విరామం అనంతరం భారత జట్టు మరోసారి టీ20 వరల్డ్‌కప్‌ను నెగ్గింది. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని రోహిత్ సారథ్యంలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పొట్టికప్‌ను నెగ్గి అభిమానుల కలను సాకారం చేసింది. ఇక హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్నారు. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కొత్త కోచ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి వరల్డ్‌కప్‌ను అందించిన టీమ్‌కు అభినందించారు. ఇక టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తే జట్టుకు మంచి విషమవుతుందన్నారు. గత వన్డే ప్రపంచకప్‌లోనే రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. అయితే, ఆ సమయంలో పదవీకాలాన్ని టీ20 వరల్డ్‌కప్ వరకు పొడిగించింది. ఈ క్రమంలో కొత్త కోచ్ వేటలో పడింది. ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును విజయతీరాలకు చేర్చడంలో కృషి చేసిన టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐ దృష్టి పెట్టింది.
కొత్తకోచ్‌గా అతన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 2011లో భారత జట్టు ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్ కోచ్ అయితే బాగుంటుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. గంభీర్ సైతం ఇందుకు ఓకే చెప్పాడు. తనకు ఆ అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే ఇంటర్వ్యూలు సైతం పూర్తి చేసింది. అయితే, ఇప్పటి వరకు కోచ్ ఎంపికపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో బిన్నీ మాట్లాడుతూ అన్ని ఫార్మాట్లలోనూ ఆడిన అనుభవం ఉన్న ఆటగాడి కోసం ఎదురుచూస్తున్నామని, అతనికే కోచింగ్ బాధ్యతలు అప్పగిస్తామని పేర్కొన్నాడు. గంభీర్‌కు ఆ అనుభవం పుష్కలంగా ఉందని.. అతడు కనుక బాధ్యతలు స్వీకరిస్తే అది భారత క్రికెట్‌కు మంచి విషయమే అన్నారు. అతడి అనుభవం భారత్‌కు కావాలని.. అన్ని ఫార్మాట్లలోనూ ఆడిన అనుభవం ఉన్న ఆటగాడని కోచ్‌గా కోరుకుంటున్నామని తెలిపాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram