Rohit Shrama|గ్రౌండ్‌లో వాష్టింగ‌న్‌ని కొట్టేందుకు ఉరుకులు పెట్టిన రోహిత్ శ‌ర్మ‌.. ఎందుకంటే..!

Rohit Shrama| కొత్త హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ నేతృత్వంలో టీమిండియా వ‌న్డే సిరీస్ ఆడుతున్న విష‌యం తెలిసిందే. శ్రీలంక‌తో మూడు వన్డే సిరీస్‌లో టీమిండియా వైఫల్యం కొనసాగిస్తుండ‌డం అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. సునాయసంగా గెలవాల్సిన తొలి వన్డేను చేజేతులా టై

  • By: sn    sports    Aug 05, 2024 6:48 AM IST
Rohit Shrama|గ్రౌండ్‌లో వాష్టింగ‌న్‌ని కొట్టేందుకు ఉరుకులు పెట్టిన రోహిత్ శ‌ర్మ‌.. ఎందుకంటే..!

Rohit Shrama| కొత్త హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ నేతృత్వంలో టీమిండియా వ‌న్డే సిరీస్ ఆడుతున్న విష‌యం తెలిసిందే. శ్రీలంక‌తో మూడు వన్డే సిరీస్‌లో టీమిండియా వైఫల్యం కొనసాగిస్తుండ‌డం అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. సునాయసంగా గెలవాల్సిన తొలి వన్డేను చేజేతులా టై చేసుకున్న రోహిత్ సేన.. రెండో వన్డేలో పేల‌వమైన బ్యాటింగ్ వ‌ల‌న 32 ప‌రుగులు తేడాతో ఓడిపోవ‌ల్సి వ‌చ్చింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక 1-0తో ఆధిక్యంలో నిలిచింది. శివమ్ దూబే, కేఎల్ రాహుల్ డకౌట్‌గా వెనుదిరగడం భార‌త్‌కి మైన‌స్ అయింది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు కాసేపు క్రీజులో నిల్చున్నా ఫలితం మరోలా ఉండేది.

ప్ర‌స్తుతం వ‌న్డే టోర్న‌మెంట్‌కి రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న ప‌లు సంద‌ర్భాల‌లో ఆట‌గాళ్ల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే రెండో వన్డే మ్యాచ్‌లో బౌలింగ్ చేయడానికి సరైన రన్-అప్ తీసుకోవడంలో పదేపదే తప్పులు చేసిన స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను కొట్టడానికి రోహిత్ శర్మ పరుగులు తీస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్‌ బౌలింగ్ చేసిన సుందర్ ర‌నప్ తీసుకోవ‌డంలో మూడు సార్లు ఇబ్బంది ప‌డ్డాడు. మొద‌టిసారి త‌డ‌బ‌డిన‌ప్పుడు రోహిత్ లైట్ తీసుకున్నాడు. రెండో సారి అలానే చేసే స‌రికి కాస్త సీరియ‌స్ అయ్యాడు రోహిత్.

సుందర్ మూడోసారి కూడా అదే తప్పు చేయ‌డంతో ఓపిక నశించి సుందర్ ను కొట్టేందుకు పరిగెత్తాడు రోహిత్ శ‌ర్మ‌. అయితే ఇదంతా సరదాగా జరిగిన‌ప్ప‌టికీ ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ స‌మ‌యంలో రోహిత్‌ని చూసి మిగతా ఆటగాళ్లతో పాటు సుందర్ కూడా నవ్వుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది.అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 42.2 ఓవర్లలో 208 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో మ‌రోసారి రాణించ‌గా, శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 3 ఫోర్లతో 35), అక్షర్ పటేల్(44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలం కావ‌డంతో భార‌త్ ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. శ్రీలంక బౌలర్లలో జెఫ్రె వండర్సే(6/31) 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు.