సండే మ్యాచ్ హైలైట్స్..ఎట్ట‌క‌లేకి బోణి తెరిచిన ముంబై, గుజ‌రాత్ ఖాతాలో మ‌రో ఓట‌మి

  • By: sn    sports    Apr 08, 2024 6:39 AM IST
సండే మ్యాచ్ హైలైట్స్..ఎట్ట‌క‌లేకి బోణి తెరిచిన ముంబై, గుజ‌రాత్ ఖాతాలో మ‌రో ఓట‌మి

ఐపీఎల్ సీజ‌న్ 17లో భాగంగా సండే రోజు రెండు మ్యాచ్‌లు జ‌రిగాయి. ముంబై, డీసీ మ‌ధ్య జ‌రిగిన ఫైట్‌లో ముంబై విజ‌యం సాధించ‌గా, గుజ‌రాత్‌, ల‌క్నో మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నోని విజ‌యం వ‌రించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై 29 పరుగుల తేడాతో గెలిచి చ‌రిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో 150వ విజ‌యం సాధించిన తొలా టీమ్‌గా ముంబై ఇండియ‌న్స్ రికార్డ్ నెల‌కొల్పింది. ఇక ముంబై త‌ర్వాత చెన్నై సూపర్ కింగ్స్(148), భారత్(144), లంకషైర్(143), నాటింగ్‌హమ్‌షైర్(143) ఉన్నాయి. మ‌రోవైపు తాజా మ్యాచ్‌లో ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా హాఫ్ సెంచ‌రీ చేయ‌కుండా 234 పరుగుల భారీ స్కోర్ చేసిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ స‌రికొత్త రికార్డ్ నెల‌కొల్పింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగుల స్కోరు న‌మోదు చేసింది. రోహిత్(49), ఇషాన్ కిష‌న్(42) అద్భుత‌మైన బ్యాటింగ్ తో పాటు రోమారియో షెఫర్డ్ (10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్ చేయ‌డంతో ముంబై భారీ స్కోరు నమోదు చేయ‌గ‌లిగింది.

ఇక భారీ ల‌క్ష్యాన్ని చేధించే క్ర‌మంలో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులే చేసి ఓటమిపాలైంది. పృథ్వీ షా(40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66), ట్రిస్టన్ స్టబ్స్(25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 71 నాటౌట్) రాణించినా ఉప‌యోగం లేకుండా పోయింది. ఇక మ‌రో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జైత్ర యాత్ర కొనసాగించింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన‌ లక్నో సూపర్ జెయింట్స్ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్(43 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీ చేయ‌గా, కేఎల్ రాహుల్(31 బంతుల్లో 3 ఫోర్లతో 33), నికోలస్ పూరన్(22 బంతుల్లో 3 ఫోర్లతో 32 నాటౌట్), ఆయుష్ బదోని(11 బంతుల్లో 3 ఫోర్లతో 20 నాటౌట్) విలువైన ప‌రుగులు చేశారు.

ఇక ల‌క్ష్యం పెద్ద‌గా లేక‌పోయిన కూడా గుజ‌రాత్ 164 ప‌రుగులు చేయ‌డానికి చాలా ఇబ్బంది ప‌డింది. యశ్ ఠాకూర్(5/30), కృనాల్ పాండ్యా(3/11) ధాటికి 130 పరుగులకే గుజ‌రాత్ కుప్ప‌కూలింది. ఆ జ‌ట్టులో ఓపెనర్ సాయి సుదర్శన్(23 బంతుల్లో 4 ఫోర్లతో 31) మినహా అంతా విఫలమయ్యారు. చివర్లో రాహుల్ తెవాటియా(30) ఒంటరి పోరాటం చేసిన కూడా విజ‌యం అందించ‌లేక‌పోయాడు. ఈ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే.. నిలకడగా ఆడుతున్న సాయి సుదర్శన్‌, అరంగేట్ర ప్లేయర్ బీఆర్ శరత్ ‌లను కృనాల్ పాండ్యా ఒకే ఓవర్‌లో పెవీలియ‌న్‌కి పంపి మ్యాచ్‌ని త‌మవైపుకి తిప్పాడు. విజయ్ శంకర్(17), దర్శన్ నల్కండే(12) , రషీద్ ఖాన్(0) ఎవ‌రు కూడా పోరాట ప‌టిమ ప్ర‌ద‌ర్శించ‌క‌పోవ‌డంతో గుజ‌రాత్ ఓట‌మి ఖాయ‌మైంది