T20 World Cup | టీమిండియాను కలవరపరిచేది ఆ ఒక్కటే..? ఆ సమస్యను అధిగమిస్తే కప్‌ మనదే..!

T20 World Cup | టీ20 వరల్డ్‌కప్‌లో పోరుకు టీమిండియా రెడీ అయ్యింది. ఈ నెల 5న ప్రారంభ మ్యాచ్‌ను నెదర్లాండ్‌తో తలపడనున్నది. ఈ సారి ఎలాగైనా కప్‌ను కొట్టాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉన్నది. ఇప్పటికే ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు.

T20 World Cup | టీమిండియాను కలవరపరిచేది ఆ ఒక్కటే..? ఆ సమస్యను అధిగమిస్తే కప్‌ మనదే..!

T20 World Cup | టీ20 వరల్డ్‌కప్‌లో పోరుకు టీమిండియా రెడీ అయ్యింది. ఈ నెల 5న ప్రారంభ మ్యాచ్‌ను నెదర్లాండ్‌తో తలపడనున్నది. ఈ సారి ఎలాగైనా కప్‌ను కొట్టాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉన్నది. ఇప్పటికే ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. అయితే, టీమిండియా బ్యాటింగ్‌లైనప్‌పటిష్ఠంగానే ఉన్నా బౌలింగ్‌మాత్రం కలవరపరుస్తున్నది. ఇంతకు ముందు ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో బౌలింగ్‌వైఫల్యం కారణంగానే టీమిండియా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అద్భుతమైన బ్యాటింగ్‌తో సెమీస్‌వరకు చేరిన భారత జట్టు బౌలింగ్‌వైఫల్యంతో ఇంగ్లండ్‌చేతిలో ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో భారత్‌169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఇంగ్లండ్‌16 ఓవర్లలో ఒక్క వికెట్‌నష్టపోకుండానే ఛేదించింది.

 

బుమ్రాపైనే భారమంతా..

 

గత టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌లో భారత బౌలర్లు ఎవరూ ఇంగ్లండ్‌ బ్యాటర్‌ ఎదుట తేలిపోయారు. బౌలర్లలో ఏ ఒక్కరూ బంతులతో ఇంగ్లండ్‌ బ్యాటర్స్‌ను ఇబ్బంది పెట్టలేకపోయారు. గత టీ20 వరల్డ్‌కప్‌కు భారత స్టార్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. దాంతో టీమిండియా బౌలింగ్‌లైన్‌ బలహీనమైంది. ఐపీఎల్‌తో బుమ్రా మళ్లీ మైదానంలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ముంబయి ఇండియన్స్‌ఆడిన 13 మ్యాచుల్లో 16.80 సగటుతో మొత్తం 20 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో బ్యాటర్‌పరుగుల వరద పారించినా.. ఈ సీజన్‌లో 6.48 ఎకామితో బుమ్రా బంతితో అద్భుత ప్రదర్శన చేశాడు. తాజాగా తిరిగి జాతీయ జట్టులోకి రావడంతో టీమిండియా బౌలింగ్‌ లైనప్‌ కాస్త బలంగా మారింది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న బుమ్రాకు.. మరో ఎండ్‌లో ఎవరు బంతితో రాణిస్తారన్నదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

 

కలవరపరుస్తున్న సిరాజ్‌ ఫామ్‌..

 

టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహ్మద్‌ సిరాజ్‌ ఫామ్‌ అందరినీ కలవరపరుస్తుంది. గత కొంతకాలంగా సిరాజ్‌ఫామ్‌లో లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వైట్‌బ్యాల్‌తో తనదైన శైలిలో మ్యాజిక్‌ చేయలేకపోతున్నాడు. 10 అంతర్జాతీయ టీ20ల్లో కేవలం 12 వికెట్లు మాత్రమే తీశాడు. అదే సమయంలో పరుగులు భారీగా ఇవ్వడం, ఒత్తిడిని తట్టుకోలేకపోవడం సిరాజ్‌ బలహీనతగా మారింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున 14 మ్యాచులు ఆడిన సిరాజ్‌ 15 వికెట్లు తీశాడు. అయితే, పరుగులు మాత్రం భారీగానే సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే వరల్డ్‌కప్‌లో ఎలా ఆడుతాడన్నది ప్రశ్నార్థకంగా మారింది.

 

నిలకడలేమితో అర్ష్‌దీప్‌ సతమతం..

 

టీమిండియా మరో పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ నిలకడలేమితో సతమతమవుతున్నాడు. డెత్‌ ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇవ్వడం కలవరపరుస్తున్నది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో అర్ష్‌దీప్ సింగ్ 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అయితే, ఎకానమీ పదికిపైగానే ఉండడం ఆందోళనకు గురి చేస్తున్నది. వికెట్లు తీయడంలో విజయవంతమైనా.. పరుగులను నియంత్రించడంలో ఘోరంగా విఫలమయ్యాడు.

 

పేస్‌ పిచ్‌లపై స్పిన్‌త్రయం మ్యాజిక్‌ పని చేసేనా..?

 

అదే సమయంలో ఆల్‌రౌండర్లు హార్దిక్‌ ప్యాండ్యా, శివమ్‌ దూబేపై టీమిండియా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఐపీఎల్‌లో ముంబయి కెప్టెన్‌గా వ్యవహరించిన ప్యాండ్యా అటు బ్యాట్‌తో, ఇటు బాల్‌తో గానీ రాణించలేకపోయాడు. శివమ్ దూబే కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌తో స్పిన్‌త్రయం పటిష్టంగానే ఉన్నది. అయితే, అమెరికా, వెస్టిండిస్‌పిచ్‌లు పేస్‌కు అనుకులంగా ఉంటాయి. ఈ క్రమంలో స్పిన్‌యత్రం ఎలా రాణిస్తారో చూడాల్సిందే. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ టీమిండియా మంచి ప్రదర్శన చేస్తే మరోసారి విశ్వకప్‌విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.