T20 World Cup| ఈ దిగ్గ‌జ క్రికెట‌ర్స్‌కి ఇదే చివ‌రి వ‌ర‌ల్డ్ క‌ప్.. ఆ లిస్ట్‌లో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే..!

T20 World Cup| ఐపీఎల్ పూర్తైంది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి జూన్2 నుండి ప్రారంభం కానున్న పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌పై ఉంది. ఈ సారి అమెరికా, వెస్టిండీస్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారు అనే దానిపై జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. గ‌త ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ని

  • By: sn    sports    May 31, 2024 7:33 PM IST
T20 World Cup| ఈ దిగ్గ‌జ క్రికెట‌ర్స్‌కి ఇదే చివ‌రి వ‌ర‌ల్డ్ క‌ప్.. ఆ లిస్ట్‌లో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే..!

T20 World Cup| ఐపీఎల్ పూర్తైంది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి జూన్2 నుండి ప్రారంభం కానున్న పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌పై ఉంది. ఈ సారి అమెరికా, వెస్టిండీస్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారు అనే దానిపై జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. గ‌త ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ని తృటిలో చేజార్చుకున్న టీమిండియా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాల‌నే క‌సితో ఉంది. ఇక ఈ టోర్నీ ఇండియాకి చెందిన ప‌లువురు ఆట‌గాళ్ల‌కే కాక ఇత‌ర దేశాల‌కి చెందిన ఆట‌గాళ్ల‌కి కూడా చివ‌రి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కానుంది. ఐదుగురు దిగ్గ‌జ క్రికెట‌ర్స్ టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా క‌నిపిస్తున్నాయి.

ముందుగా ఇందులో 37 ఏళ్ల రోహిత్ శ‌ర్మ క‌నిపిస్తున్నాడు. భారత్ తరఫున ఇప్పటివరకు 151 టీ20 మ్యాచ్‌లు ఆడిన శర్మ 3974 పరుగులు చేశాడు. అతని వ‌య‌స్సు కార‌ణంగా రోహిత్‌కి ఇదే చివ‌రి టీ20 ప్ర‌పంచ క‌ప్ అని చెప్పాలి. ఇక బంగ్లాదేశ్ క్రికెట‌ర్ , ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా 37 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. పెరుగుతున్న వయస్సు కారణంగా అతను కూడా పొట్టి ఫార్మాట్‌కి గుడ్ బై చెప్పే అవ‌కాశం ఉంది. 2006 నుండి ఆడుతూ వ‌స్తున్న ష‌కీబ్ బంగ్లాదేశ్ తరఫున 122 టీ20 మ్యాచ్‌లు ఆడి 2440 పరుగులు, 146 వికెట్లు సాధించాడు. ఇక ఆస్ట్రేలియా లెజెండరీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లకి గుడ్ బై చెప్ప‌గా ఇప్పుడు టీ20 ప్ర‌పంచ క‌ప్ పూర్తైన త‌ర్వాత ఆ ఫార్మాట్‌కి గుడ్ బై చెప్పే అవ‌కాశం ఉంది.

37 ఏళ్ల వార్నర్ ఆస్ట్రేలియా తరఫున 103 టీ20 మ్యాచ్‌లు ఆడి 3099 పరుగులు చేశాడు.ఇక ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ కూడా టీ20 ఫార్మాట్‌కి రిటైర్మెంట్ ఇచ్చే అవ‌కాశం ఉంది. జ‌ట్టులో యువ ఆట‌గాళ్ల‌కి ప్రాధాన్య‌త ఇస్తున్న నేప‌థ్యంలో కోహ్లీని ప‌క్క‌న పెట్టే ఛాన్స్ ఉంది. కోహ్లీ భారత్ తరఫున 117 టీ20 మ్యాచ్‌లు ఆడి 4037 పరుగులు చేశాడు. ఇక శ్రీలంక వెటరన్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ కూడా T20 ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇటీవ‌ల మాథ్యూస్‌కి అవ‌కాశాలు చాల త‌క్కువ వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో అత‌ను రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మాథ్యూస్ శ్రీలంక తరఫున 87 టీ20 మ్యాచ్‌లు ఆడి 1354 పరుగులు, 45 వికెట్లు పడగొట్టాడు. ఇలా ఈ దిగ్గ‌జ క్రికెటర్స్‌కి వారి కెరీర్‌లో ఇదే చివ‌రి టీ 20 ప్ర‌పంచకప్ కానుంది.