విధాత : ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో బేబి బాస్,యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశారు. తిలక్ వర్మ చేతుల మీదుగా వైభవ్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు.సంజు శాంసన్ స్థానంలో వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
వైభవ్ టీమిండియా తరుపున…అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న అతి పిన్న వయసు భారత క్రికెటర్‌గా(15 ఏళ్ల 99 రోజుల వయసు) రికార్డు సాధించాడు. సచిన్ రికార్డు(16ఏళ్ల 205 రోజులు)ను వైభవ్ అధిగమించాడు. ఇంగ్లాండ్, భారత్ మధ్య రెండో టీ20 ప్రారంభమైంది.
14పరుగులకు వైభవ్ అవుట్
టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా వచ్చారు.వైభవ్ సూర్యవంశీ తాను ఎదుర్కొన్న మూడో బంతికి సింగిల్ తీసి అంతర్జాతీయ క్రికెట్ లో తన పరుగుల ఖాతా తెరిచాడు. జోఫ్రా ఆర్చర్, టంగ్ బౌలర్లలో వైభవ్ సూర్యవంశీ ఒక్కోటి చొప్పున రెండు సిక్సర్లు కొట్టాడు. అభిషేక్ కూడా మరోవైపు ఫోర్లు, సిక్సర్ బాదడంతో టీమిండియా 5ఓవర్లకు 50పరుగులు చేసింది. విల్ జాక్స్ బౌలింగ్ లో వైభవ్ 10బంతుల్లో 2సిక్సు లతో 14 పరుగులకు అవుటయ్యాడు. తొలి వికెట్ కు వారిద్దరు 5 ఓవర్లలో 50పరుగులు చేశారు. అభిషేక్ 19బంతుల్లో 1సిక్స్, 5ఫోర్లతో 30 పరుగులతో ఆడుతున్నారు. ఇషాన్, అభిషేక్ క్రీజ్ లో ఉన్నారు.
The start of a special chapter ✨
A proud moment as Vaibhav Sooryavanshi receives his #TeamIndia cap from Vice-Captain Tilak Varma 🧢
Updates ▶️ https://t.co/WYfL8tAm58 #ENGvIND pic.twitter.com/zpLtixYDgM
— BCCI (@BCCI) July 4, 2026
