Viral news | పుట్టింటి నుంచి వరకట్నం తీసుకురా.. లేదంటే ఆ అఫ్రికన్‌తో పడుకో.. భార్యకు ఓ భర్త వేధింపులు..!

Viral news | అన్యోన్యంగా సాగాల్సిన సంసారంలో ఓ భర్త ప్రవర్తన చిచ్చుపెట్టింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త ఓ భార్యపట్ల కట్న పిచాశిగా మారాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన 40 ఏళ్ల మహిళ భర్త చేతిలో దారుణ వేధింపులకు గురైంది.

Viral news | పుట్టింటి నుంచి వరకట్నం తీసుకురా.. లేదంటే ఆ అఫ్రికన్‌తో పడుకో.. భార్యకు ఓ భర్త వేధింపులు..!

Viral news : అన్యోన్యంగా సాగాల్సిన సంసారంలో ఓ భర్త ప్రవర్తన చిచ్చుపెట్టింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త ఓ భార్యపట్ల కట్న పిచాశిగా మారాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన 40 ఏళ్ల మహిళ భర్త చేతిలో దారుణ వేధింపులకు గురైంది. చైనాలో ఉద్యోగం చేసే భర్త.. అక్కడ పొరుగున ఉన్న ఆఫ్రికా వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వేధించాడని, బలవంతంగా తన మొబైల్‌లో అశ్లీల చిత్రాలను చూపించేవాడని ఆమె ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

చైనాలో ఉన్న తనపై భర్త వరకట్న వేధింపులు, గృహహింస పెరిగిపోయాయని, డబ్బు కోసం పరాయి మగాళ్లతో పడుకోవాలని వేధించేవాడని, ఆ వేధింపులు భరించలేక తాను చైనాలోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించానని బాధిత మహిళ చెప్పింది. భారత రాయబార కార్యాలయం సాయంతో తాను భారత్‌కు చేరుకున్నట్టు తెలిపింది. స్వదేశానికి వచ్చిన తర్వాత రాయబార కార్యాలయం సలహాతో ఆమె భర్త తీరుపై లక్నో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా, 2015లో లక్నోకు చెందిన బాధిత మహిళకు అదే నగరంలోని గణేష్ గంజ్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. చైనాలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేసే అతను పెళ్లియిన వారం రోజుల నుంచే రూ.15 లక్షల వరకట్నం కోసం వేధించడం మొదలుపట్టాడు. ఆ తర్వాత ఏడాదికి వారికి ఒక కుమార్తె జన్మించింది. అయితే ఆడబిడ్డ పుట్టిందనే కారణంతో అత్తామామలు కూడా వేధించడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో 2020లో కరోనా సమయంలో ఆమె భర్త భారత్‌కు తిరిగి వచ్చాడు. తర్వాత ఆమెను కూడా చైనా తీసుకెళ్లేందుకు వీసా, విమాన టికెట్లు తీశాడు. అందుకు ఖర్చులను ఆమె తల్లిదండ్రుల నుంచే వసూలు చేశాడు. అంతేగాక మరో రూ.2 లక్షల నగదు కూడా తీసుకున్నాడు. చైనాకు తీసుకెళ్లినప్పటి నుంచి ఆమెపై వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయి. ‘పుట్టింటి నుంచి వరకట్నమైనా తీసుకురా.. లేదంటే పొరిగింట్లో ఉన్న ఆఫ్రికన్‌తో పడుకోనైనా పడుకో’ అని వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు తాళలేక ఆమె ఫిర్యాదు చేసింది.