Terrifying Video: Leopard Attack | సఫారీలో బాలుడిపై చిరుతపులి దాడి.. బెంగళూరులోని బన్నేర్‌ఘట్టలో ఘటన
సఫారీల్లోకి వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నదీ వీడియో. ఇది ఆగస్ట్ 15న బెంగళూరులోని బన్నేర్‌ఘట్ట సఫారీ పార్క్‌లో తీసిన వీడియో. పంద్రాస్టు సెలవు ఉండటంతో కుటుంబంతో కలిసి బన్నేర్‌ఘట్ట జూ పార్క్‌కు వెళ్లిన 13 ఏళ్ల బాలుడిపై ఒక చిరుతపులి దాడి చేసింది. భయంగొలిపే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వెనుక వాహనం లోని ఒకరు ఈ వీడియో తీశారు.

Terrifying Video: Leopard Attack | సఫారీలోకి వాహనాలు వచ్చినప్పుడు వాటి చుట్టూ గుడ్డెలుగులు వంటివి మాత్రమే కాదు.. అప్పుడప్పుడు పులులు, సింహాలు, చిరుతపులులు సైతం తచ్చాడుతాయి. ఇది సాధారణమే అనుకున్నా.. ఒక్కోసారి అవి ఉగ్రరూపం దాల్చుతాయి. ఈ ఘటనలో కూడా మొదట ప్రశాంతంగానే ఉన్న చిరుతపులి.. ఒక బాలుడు విండో బయటకు తన చేతిని నిర్లక్ష్యంగా పెట్టడంతో ఒక్కసారిగా రెచ్చిపోయి వాహనంపైకి దాడి చేసింది. వెనుక కాళ్లపై నిలబడి.. వాహనం అద్దానికి ఉన్న ఇనుపగ్రిల్‌పై తన పంచాలతో ఎటాక్ చేసింది. ఆ సమయంలో అక్కడ ఉన్న బాలుడు సులభంగా చిరుపులి దాడికి గురయ్యాడు. డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వాహనాన్ని వేగంగా తీసుకుపోయాడు. అయినప్పటికీ కొంత దూరం ఆ వాహనాన్ని చిరుతపులి వెంటాడింది. ఈ ఘటనతో ఆ వాహనంలో ఉన్నవారంతా ఒక్కసారిగా భయకంపితులై పోయారు. ఈ మొత్తం ఘటనను వెనుక వస్తున్న మరో వాహనంలో ఒకరు రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ బాలుడు బొమ్మసంద్ర ప్రాంతానికి చెందినవాడు. ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో అతడు ఒక నాన్ ఎయిర్ కండిషన్డ్ వాహనంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నాడు.
ఘటన జరిగిన వెంటనే పార్క్ హెడ్డాఫీస్‌కు వాహనాన్ని డ్రైవర్ తీసుకెళ్లాడు. వెంటనే బాలుడికి ప్రాథమిక చికిత్స చేసి, హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. బాలుడికి తీవ్ర గాయాలు కానీ, ఇన్ఫెక్షన్ బారిన పడే గాయాలు కానీ ఏమీ లేవని వైద్యులు పేర్కొన్నారు. పంజా తగలడంతో కొంచె చీరుకుపోయిందని, ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. ఈ సంఘటనపై పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏవీ సూర్యసేన్ స్పందిస్తూ.. భవిష్యత్తులో ఇటువంటివి చోటు చేసుకోకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇవి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయని తెలిపారు. ఇదెలా ఉన్నా.. పార్క్ మేనేజ్‌మెంట్‌పై పోలీసులు మెడికో లీగల్ కేసు పెట్టారు. హాస్పిటల్‌లో బాలుడు కోలుకుంటున్నాడు. ఈ ఘటనతో సఫారీ వాహనాల్లో సందర్శకుల భద్రత, వాహనాల్లో పాటించాల్సిన ప్రొటోకాల్స్ మరోసారి చర్చనీయాంశమైంది.
— Karnataka Portfolio (@karnatakaportf) August 15, 2025
ఇవి కూడా చదవండి..
Bandipur Elephant Attack : పర్యాటకుడిపై ఏనుగు దాడి..వైరల్ గా వీడియో
Leopard Attack Man Riding Bike | తిరుమలలో బైకర్స్ పై చిరుత దాడి
Bear Adventur Attack: బిడ్డ జోలికిస్తే పులి అయినా బలాదూర్..ఎలుగబంటి సాహసం వైరల్ !
crocodile attack । చేపలు పట్టేందుకు వెళితే.. మొసలి పట్టుకుపోయింది..