Bandipur Elephant Attack : పర్యాటకుడిపై ఏనుగు దాడి..వైరల్ గా వీడియో

బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో పర్యాటకుడిపై ఏనుగు దాడి.. వీడియో సోషల్ మీడియాలో వైరల్! అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు.

Bandipur Elephant Attack : పర్యాటకుడిపై ఏనుగు దాడి..వైరల్ గా వీడియో

Bandipur Elephant Attack | విధాత : అసలే మద గజం..దానికి తిక్క రేగితే ఊరుకుంటుందా..ఏకంగా వెంటపడి మరి కాళ్లతో ఓ వ్యక్తిని తొక్కేసి తన కసిని తీర్చుకుంది. ఏనుగు దాడికి సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారింది. కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో కేరళాకు చెందిన ఓ పర్యాటకుడిపై అటవీ ఏనుగు దాడి చేసింది. అతను పారిపోతున్నప్పటికీ ఏనుగు వెంటబడి మరి దాడి చేసింది. పరుగెత్తే క్రమంలో పడిపోయిన అతడిని కాళ్లతో తొక్కింది. అదృష్టవశాత్తు ఆ పర్యాటకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

గాయాలపాలైన అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభయారణ్యంలో రోడ్డుపై వాహనాలతో పర్యాటకుల ధ్వనులలో చికాకుతో ఏనుగు ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు.