Mission Uranus | అక్కడికి వెళితే ఐదు క్షణాల్లోనే వజ్రాలైపోతారు.. ఆ తర్వాత..! వీడియో చూడండి..

మనుషులను వజ్రాలుగా మార్చే గాలులవి. ఆ గాలుల్లో ఈత కొట్టొచ్చు.. పల్టీలు కొట్టొచ్చు.. కానీ.. ఆ గ్రహం అత్యంత దుర్గంధాన్ని వెలువరిస్తుంది. అక్కడికి మనిషి వెళితే ఏం జరుగుతుందనేది ఒక రియలిస్టిక్‌ వీడియోను శాస్త్రవేత్తలు తయారు చేశారు.

Mission Uranus | అక్కడికి వెళితే ఐదు క్షణాల్లోనే వజ్రాలైపోతారు.. ఆ తర్వాత..! వీడియో చూడండి..

Mission Uranus | అంతు చిక్కని ఈ అనంత విశ్వంపై సాగే పరిశోధనల్లో అనేక కొత్త విషయాలు అర్థమవుతూ వస్తుంటాయి. ఈ విశ్వంలో మనలాంటివాళ్లే ఎవరైనా ఉన్నారా? అనే అంశం మొదలుకుని.. ఈ ధరిత్రికి అవసరమైన అపురూపమైన వనరుల అన్వేషణకు సైతం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సౌర కుటుంబంలోని గ్రహాలను కూడా పరిశోధకులు నిత్యం గమనిస్తూనే ఉంటారు. సాధారణంగా వజ్రాల్లాంటి మనుషులు.. అని బలమైన వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ.. ఒక గ్రహంపైకి వెళితే మనుషులు సైతం వజ్రాలు అయిపోతారట. కడు విచిత్రం కదూ! అందుకే ఈ విశ్వం వందల ఏళ్ల తరబడి మనుషులకు ఒక ఆసక్తికర అంశంగానే ఉంటున్నది. దానిని అన్వేషించే క్రమంలోనే మనిషి టెలిస్కోపులను నిర్మించాడు. భూమి మీద నుంచి గగన లోతులు చూసేందుకే కాదు.. ఆకాశం నుంచి సైతం దర్శించేస్థాయిలో సాంకేతికతను అభివృద్ధి చేసుకుని.. తన అన్వేషణను మరింత మెరుగుపర్చాడు. ఇప్పటికైతే జీవం ఉన్న ఏకైక గ్రహం మనం నివసిస్తున్న భూమి. ఇలాంటి భూమి లేదా భుములు మరెక్కడన్నా ఉన్నాయా? అనే విషయం ఇంకా తెలియదు. మన భూమి ఉన్న సౌర కుటుంబంలో మొత్తం ఏడు గ్రహాలు ఉన్నాయి. కానీ.. భూమి తప్ప మరే గ్రహంలోనూ జీవం లేదు. వీటిలో పరిశోధకులు అంగారకుడిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కొన్ని వందల ఏళ్ల క్రితం అంగారకుడిపై జీవం ఉండి ఉంటుందనే అంచనాలతో శాస్త్రవేత్తలు ఉన్నారు.

యురేనస్‌ రహస్యమేంటి?

అసలు విషయానికి వస్తే.. సౌర కుటుంబంలో భూమి మాత్రమే నీలి గ్రహం కాదు. ఇందులోని ఏడో గ్రహం యురేనస్‌ కూడా నీలి గ్రహమే. కాకపోతే ఇదంతా పూర్తిగా వాయువులతో నిండి ఉన్నది. హైడ్రోజన్‌ సల్ఫైడ్‌, హీలియం, మీథేన్‌ వంటి వాయువలతో నిండి, చల్లటి వాతావరణం ఆవరించిన గ్రహం.. యురేనస్‌. నిజానికి ఇది భూమిలాంటి ఉపరితలం కలిగి లేదు. పైగా.. అక్కడ వెలువడే దుర్గంధం.. భరించలేనంత దారుణంగా ఉంటుందట.

యురేనస్‌ మీదకు మనిషి వెళితే ఏం జరుగుతుంది?

చనిపోతారు! నిజమే.. కేవలం ఐదు సెకండ్ల వ్యవధిలోనే మనిషి అక్కడ చనిపోతాడు. ఎంతటి కట్టుదిట్టమైన, అత్యంత ఆధునాతన స్పేస్‌ సూట్లు ధరించినా కూడా ఉపయోగం ఉండదు. దీనికి సంబంధించిన ఒక యూట్యూబ్‌ వీడియోను చూడొచ్చు. యురేనస్‌పైకి వెళ్లిన మనుషులకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనే విషయంలో పూర్తి రియలిస్టిక్‌గా అనిపించే వీడియో ఇది. అక్కడి వాతావరణంలో గాల్లోనే పల్టీలు కొట్టొచ్చు.. ఈత కొట్టవచ్చు. అక్కడ ఉపరితలం ఏదీ లేని కారణంగా ఎంత పల్టీలు కొట్టినా దీన్నీ ఢీకొనే అవకాశం ఉండదు. కానీ.. మనం ఐదు సెకండ్లు కూడా అక్కడ బతకలేం. ఎందుకంటే.. అక్కడ గంటకు 900 కిలోమీటర్ల వేగంతో వజ్రాల తుఫాను గాలులు వీస్తూ ఉంటాయి. దాని తీవ్రత గురించి చెప్పాలంటే.. భూమిపై ఐదో కేటగిరీ హరికేన్‌ తీవ్రతకు మూడున్నర రెట్టు అధికంగా ఉంటుంది. అక్కడ ఉండే మీథేన్‌ గ్యాస్‌ కారణంగానే యూరేనస్‌ నీలి రంగులో కనిపిస్తూ ఉంటుంది. మైనస్‌ 224 డిగ్రీల సెల్సియస్‌ చలి ఉంటుంది. అత్యంత ఒత్తిడితో ఉండే మీథేన్‌ వాయువులు.. దేన్నైనా వజ్రాలుగా మార్చేస్తాయి. అంటే.. అక్కడికి వెళ్లే మనిషి.. అక్కడి వాతావరణం తీవ్రతతో వజ్రంగా మారిపోతాడన్నమాట. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఆ యూట్యూబ్‌ వీడియోలో ఉన్నాయి.