GPT-4o | ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఓపెన్‌ ఏఐ సరికొత్త మోడల్‌..!

GPT-4o | ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చాట్‌ జీపీటీతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఓపెన్‌ ఏఐ.. తాజాగా మరో ఏఐ మోడల్‌ జీపీటీ 4ఓని పరిచయం చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల స్ప్రింగ్‌ అప్‌డేట్‌ కార్యక్రమంలో వివరాలను వెల్లడించింది. అయితే, ఈ జీపీటీ 4వో ద్వారా ఐతో వీడియో ఇంటరాక్షన్‌ నిజజీవితంలో మనుషులతో మాట్లాడినట్లుగా ఉండడం విశేషం.

GPT-4o | ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఓపెన్‌ ఏఐ సరికొత్త మోడల్‌..!

GPT-4o | ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చాట్‌ జీపీటీతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఓపెన్‌ ఏఐ.. తాజాగా మరో ఏఐ మోడల్‌ జీపీటీ 4ఓని పరిచయం చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల స్ప్రింగ్‌ అప్‌డేట్‌ కార్యక్రమంలో వివరాలను వెల్లడించింది. అయితే, ఈ జీపీటీ 4వో ద్వారా ఐతో వీడియో ఇంటరాక్షన్‌ నిజజీవితంలో మనుషులతో మాట్లాడినట్లుగా ఉండడం విశేషం. మనం ఒక వ్యక్తితో ముచ్చటించినట్లుగా ఏఐతో సంభాషణలు జరుపుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ టూల్‌ ఆటేమెటెడ్ మెషీన్ల వాయిస్ వింటే అది కంప్యూటర్ జనరేటెడ్ అని తేలిగ్గా పసిగట్టేందుకు అవకాశం ఉండేది.

అయితే, జీపీటీ 4లో దీన్ని పూర్తిగా మార్చివేసింది. మనం మాట్లాడుతున్నది మనుషలతో అనే భావనను కలిగిస్తున్నది. సాధారణ సంభాషణలతో పాటు వీడియో ఇంటరాక్షన్స్ సైతం ఇందులో ఉండడం ప్రత్యేక. ఇది వాస్తవిక ప్రపంచాన్ని మరిపిస్తున్నది. ఉదారణకు మీరు జీపీటీ 4ఓ సంభాషిస్తున్న సమయంలో భయంగా ఉన్నట్లు మాట్లాడితే ఏఐ నుంచి రెస్పాన్స్‌ సైతం అదే టోన్‌లో వస్తుంటుంది. మీ ఇంట్లో కుటుంబీకులతోనే మాట్లాడినట్లుగానే ఉంటుంది. కొత్తగా తీసుకువచ్చిన ఫ్లాగ్‌షిప్‌ గ్రేడ్‌ ఏఐ మోడల్‌లో ఓ అంటే ఓమ్నీ మోడల్ అర్థం కాగా.. ఈ కొత్త చాట్‌బోట్‌ రెండురెట్లు వేగంగా పని చేయనున్నది. 50శాతం తక్కువ ధరకే లభించనున్నది.

జీపీటీ 4 టర్బో మోడల్‌తో పోలిస్తే రేట్‌ లిమిట్స్ ఐదురెట్లు ఎక్కువగా ఉంటాయి. స్పీచ్ మోడ్‌లో రియల్ టైమ్ రెస్పాన్స్ సైతం ఉంటుంది. వాయి‌స్‌లో ఎమోషన్‌ను సైతం జోడించడం విశేషం. దాంతో రోబో మాట్లాడినట్లు కాకుండా మనుషులతోనే మాట్లాడినట్లుగా రెస్పాన్స్‌ వస్తుంది. మనం ఎమోషనల్‌గా మాట్లాడినా ఏఐ సైతం అదే తరహాలో ప్రతిస్పందిస్తుంది. అయితే, జీపీటీ 4ఓ సబ్‌స్క్రిప్షన్‌ చార్జీల వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. కొత్త ఏఐని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుండగా.. అదే సమయంలో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ని వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక చాట్ జీపీటీకి కొత్త డెస్క్ టాప్‌ యాప్‌ని సైతం లాంచ్‌ చేయనున్నట్లు కంపెనీ చెప్పింది. వెబ్ క్లయింట్ యూజర్ ఇంటర్‌ఫేస్‌లో స్వల్పంగా మార్పులు సైతం చేసినట్లు చెప్పింది.