చింతమడకలో కవిత బతుకమ్మ సందడి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ పండగ సంద్భంగా సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. చింతమడకలో ఎంగిలిపువ్వు బతుక్మ వేడుకకు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కవితకు జాగృతి కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విధాత): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ పండగ సంద్భంగా సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. చింతమడకలో ఎంగిలిపువ్వు బతుక్మ వేడుకకు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కవితకు జాగృతి కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. సిద్ధిపేట నుంచి తన తండ్రి కేసీఆర్ స్వగ్రామం చింతమడక వరకు అడుగడుగునా ఆమెకు మంగళహారతులు పట్టారు. ఈ సందర్భంగా జాగృతి కార్యకర్తలు సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. రాఘవాపురంలో గంగపుత్రుల సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. చింతమడకకు వెళ్తూ.. మార్గమధ్యలో అల్వాల్‌లోని సిధారెడ్డి నివాసానికి వెళ్లారు. చింతమడకకు చేరుకున్న కవిత అక్కడి మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చి, వారితో కలిసి బతుకమ్మ ఆడారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.