కేటీఆర్‌పై రాళ్ల దాడి కేసులో 23 మంది అరెస్ట్

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అదిలాబాద్ జిల్లా బైంసాలో హనుమాన్ దీక్షాదారులు టమాటాలు, ఉల్లిగడ్డలతో చేసిన దాడి ఘటనలో 23 మందిని అరెస్ట్ చేశామని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు

కేటీఆర్‌పై రాళ్ల దాడి కేసులో 23 మంది అరెస్ట్

విధాత, హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అదిలాబాద్ జిల్లా బైంసాలో హనుమాన్ దీక్షాదారులు టమాటాలు, ఉల్లిగడ్డలతో చేసిన దాడి ఘటనలో 23 మందిని అరెస్ట్ చేశామని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. కేటీఆర్ పై దాడి కేసులో విచారణ చేపట్టి సీసీ టీవీల ఫుటేజీ, వీడియో చిత్రీకరణల ద్వారా నిందితులను గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారాలు చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు క్షమాపణలు చెప్పాలంటూ హనుమాన్ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బైంసాలో హనుమాన్ దీక్షాదారులు ఆయనపై దాడికి పాల్పడ్డారు.