Ganja | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 40 కిలోల గంజాయి సీజ్.. మహిళ అరెస్ట్
Ganja | శంషాబాద్ ఎయిర్‌పోర్టు( Shamshabad Airport )లో భారీగా గంజాయి( Ganja ) పట్టుబడింది. దుబాయ్( Dubai ) నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద 40 కిలోల గంజాయి పట్టుబడింది.

Ganja | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు( Shamshabad Airport )లో భారీగా గంజాయి( Ganja ) పట్టుబడింది. దుబాయ్( Dubai ) నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద 40 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ గంజాయి విలువ రూ. 14 కోట్లకు పైగానే ఉంటుందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పేర్కొన్నారు.
ఓ మహిళా ప్రయాణికురాలు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దుబాయ్ నుంచి వచ్చింది. ఆమెకు సంబంధించిన రెండు లగేజీ బ్యాగులను పరిశీలించగా, గంజాయి లభించింది. అయితే ఆమె బ్యాంకాక్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమానాలు ఉన్నప్పటికీ.. గతంలో గంజాయితో పట్టుబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఆమె తెలివిగా ఎవరికీ అనుమానం రావొద్దనే ఉద్దేశంతో వయా దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ గంజాయి తరలింపు వెనుక ఇంకా ఎవరిదైనా హస్తం ఉందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయితో పట్టుబడిన మహిళా ప్రయాణికురాలి వివరాలు తెలియరాలేదు.