విధాత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 4వ తేదీన తెలంగాణ కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానుంది. 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపధ్యంలో 4వ తేదీన కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత మంత్రిమండలికి ఇదే చివరి సమావేశం కానుంది. ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది.