విధాత, హైదరాబాద్: మెయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించిన వ్యవహారంపై శాసన మండలిలో జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పీసీసీ చీఫ్ బి.మహేశ్ గౌడ్, అద్దంకి దయాకర్ లు బీఆర్ఎస్ వైఖరిపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ పెరగాడానికి బీఆర్ఎస్ పాలకులే కారణం అంటూ విమర్శించారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ మెయినాబాద్ ఫాస్ హౌస్ లో దొరికిన వారు బీఆర్ఎస్ నాయకులు కాదా అంటూ ప్రశ్నించారు. ప్రజల చేత ఎన్నకోబడ్డ నాయకులు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అని విమర్శించారు.
సాక్షాత్తూ బీఆర్‌ఎస్ నాయకుడే ఫాం హౌస్‌లో డ్రగ్స్ సేవించి పట్టుబడితే దానిపై ఆ పార్టీ నాయకుని స్పందన ఏది? అని నిలదీశారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈగల్ టీమ్ లను పెట్టి ప్రయత్నిస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం డ్రగ్స్‌ను ప్రోత్సాహిస్తూ ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ స్టేట్‌గా మారుస్తున్నారు అని ఆరోపించారు.
డ్రగ్ టెస్ట్ కు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం అని, కేసీఆర్, కేటీఆర్ కూడా డ్రగ్ టెస్ట్ కు రావాలి అని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు అందరూ డ్రగ్ టెస్ట్ లకు ముందుకు రావాలని కోరారు. చట్టం అందరికీ సమానమేనని, డ్రగ్ కేసులో దొరికినోళ్లందరిపైన చర్యలు ఉండాయని, ఎంద పెద్ద వాళ్ళు ఉన్నా వదిలే ప్రసక్తే లేదు అన్నారు.
అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఈగల్ టీంకు బీఆర్ఎస్ నాయకులు దొరుకుతున్నారంటే ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దొరకలేదని ఆ పార్టీ నుంచి ఓ స్టేట్‌మెంట్ ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు. పైగా ఈగల్ టీంను, ఎఫ్ఐఆర్ ను తప్పుబడుతున్నారు అని విమర్శించారు. డ్రగ్స్ తీసుకునే వాళ్లకు అసలు పార్టీ టికెట్ ఇవ్వకూడదు అని దయాకర్ సూచించారు.
ఇవి కూడా చదవండి :
Nanda Devi Ship : నందా దేవి గ్యాస్ మోసుకొచ్చింది…ఎల్పీజీ కష్టాలకు చెక్ !
BJP MLAs protest| అసెంబ్లీకి రైతు సమస్యల దరఖాస్తులతో బీజేపీ ఎమ్మెల్యేలు
