ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్తు ప్లాంటు: రాష్ట్రానికే 85 శాతం విద్యుత్
- ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్తు ప్లాంటు
- కమర్షియల్ ఆపరేషన్ ఆరంభం
- రాష్ట్రానికే 85 శాతం విద్యుత్
- 3న వర్చువల్ గా జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ
విధాత: రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించిన తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో మొదటి దశలో చేపట్టిన 800 మెగావాట్ల విద్యుత్తు ప్లాంటు కమర్షియల్ ఆపరేషన్ ఆరంభమైంది. ఈ మేరకు సంస్థ డిక్లరేషన్ ఆఫ్ కమర్షియల్ (సీఓడీ) బుధవారం రాత్రి ప్రకటించారు. వచ్చేనెల మూడో తేదీన నిజామాబాద్ పర్యటనకు వస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్లాంటును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని సమాచారం.
ఇక్కడ ఉత్పత్తి అయ్యే 800 మెగావాట్ల విద్యుత్తులో 85% రాష్ట్ర అవసరాల కోసమే వినియోగించనున్నారు. మిగతా పదిహేను శాతం విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలో రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నెలకొల్పాలని పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram