వెయ్యి కోట్లు దాటిన మహాలక్ష్మి

మ‌హాల‌క్ష్మి ప‌థ‌కింద మ‌హిళ‌లు నాలుగు నెల‌ల్లో రూ.1177 కోట్లు ఆదా చేసిన‌ట్లుగా ప్ర‌భుత్వం భావిస్తోంది

  • Publish Date - April 8, 2024 / 05:04 AM IST

వెయ్యి కోట్లు దాటిన మహాలక్ష్మి
మ‌హాల‌క్ష్మి ప‌థ‌కింద మ‌హిళ‌లు నాలుగు నెల‌ల్లో రూ.1177 కోట్లు ఆదా చేసిన‌ట్లుగా ప్ర‌భుత్వం భావిస్తోంది

నాలుగు నెలల్లో రూ.1177 కోట్లు ఆదా

విధాత‌: మ‌హాల‌క్ష్మి ప‌థ‌కింద మ‌హిళ‌లు నాలుగు నెల‌ల్లో రూ.1177 కోట్లు ఆదా చేసిన‌ట్లుగా ప్ర‌భుత్వం భావిస్తోంది. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం ప్రారంభమైన తొలి రోజుల్లో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఆ తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరిగింది. ప్ర‌స్తుతం సగటున రోజుకు 29.67 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.

సగటున డిసెంబర్ నెల‌లో 26.99 లక్షలు, జనవరిలో 28.10 లక్షలు, ఫిబ్రవరిలో 30.56 లక్షలు, మార్చిలో 31.42 లక్షల మంది మహిళలు ఫ్రీ టికెట్ పై జర్నీ చేశారు. ఏప్రిల్ 7వ తేదీ వరకు రూ. 1177 కోట్ల విలువైన జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేసింది. అంత మొత్తం మహిళా ప్రయాణికులు ఆదా చేసినట్లు లెక్క. హైదరాబాద్ లో సుమారు 6 లక్షల మంది మహిళలు రోజూ సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. గతంలో సిటీలో బస్సు పాస్ లు, బస్సు చార్జీలకు మహిళలకు ఒక్కొక్కరు రూ.1500 వరకు ఖర్చు చేసేవారు. మహాలక్ష్మి పథకం ద్వారా అంత మేరకు మహిళలు నిధులను ఆదా చేస్తున్నారు.

 

Latest News