Hyderabad Cricket Association | హెచ్‌సీఏలో ఏసీబీ తనిఖీలు … నిధుల దుర్వినియోగంపై కేసు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ హాయాంలో జరిగిన అక్రమాలపై గతంలో ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో తాజాగా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు

Hyderabad Cricket Association | హెచ్‌సీఏలో ఏసీబీ తనిఖీలు … నిధుల దుర్వినియోగంపై కేసు

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ హాయాంలో జరిగిన అక్రమాలపై గతంలో ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో తాజాగా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో కీలక ఫైళ్లు, దస్త్రాలు, ఈ-మెయిల్స్ అధికారులు రికవరీ చేశారు. జరిగిన అక్రమాల విషయంలో మాజీ హెచ్‌సీఏ అధ్యక్షుడు, కార్యదర్శి ప్రమేయంపై ప్రస్తుత సభ్యులను ఏసీబీ అధికారులు ఆరా తీశారు. కాగా, హెచ్‌సీఏ నిధులు దుర్వినియోగం అయినట్లుగా 2023 అక్టోబరులో నాలుగు కేసులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. 2019 -2022 మధ్య కాలంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్, ఉపాధ్యక్షుడిగా జాన్ మనోజ్, సెక్రటరీగా విజయానంద్, జాయింట్ సెక్రటరీగా సరేశ్ శర్మ, ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్ అనురాధ ఉన్నారు. అజారుద్దిన్ హయంలో 2019- 2022 మధ్య కాలంలో అపెక్స్ కౌన్సిల్ నేతృత్వంలో బీసీసీఐ నుంచి వచ్చిన ఫండ్స్, ‘ఖర్చులు, టెండర్లు, కొటేషన్ల విషయంలో అవకతవకలు జరిగినట్లుగా ఫోరెన్సిక్ ఆడిట్ వెల్లడైంది. దీనిపై నమోదైన కేసుల్లో ఏసీబీ విచారణ కొనసాగిస్తుంది.