Justice Aparesh Kumar Singh | తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణస్వీకారం

Justice Aparesh Kumar Singh | విధాత, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్(Justice Aparesh Kumar Singh) ప్రమాణస్వీకారం చేశారు. శనివారం రాజ్ భవన్(Raj Bhavan) లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy), శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy), శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం వారంతా అపరేష్ కుమార్ సింగ్ కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.